Homeతెలంగాణవెయ్యేళ్ల క్రితం తిరుపతి కథతో స్వయంభు...శక్తిమాన్ పాత్రపై నిఖిల్ ఇంట్రెస్టింగ్ లీక్...!

వెయ్యేళ్ల క్రితం తిరుపతి కథతో స్వయంభు…శక్తిమాన్ పాత్రపై నిఖిల్ ఇంట్రెస్టింగ్ లీక్…!

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌: హీరో నిఖిల్ సిద్ధార్థ కార్తికేయ 2 విజయంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం స్వయంభుపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో ఇది రాజుల కాలం నాటి నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని స్పష్టమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ ఈ సినిమా కథకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నిఖిల్ మాట్లాడుతూ స్వయంభు కథ దాదాపు వెయ్యేళ్ల క్రితం జరిగిన నిజ సంఘటనల ఆధారంగా రూపొందించబడిందని చెప్పారు. క్రీస్తుశకం 985 ప్రాంతంలో రాజుల పాలన సమయంలో తిరుపతి సమీపంలోని శ్రీగిరి ప్రాంతంలో జరిగిన ఓ చారిత్రక ఘటన ఈ చిత్రానికి ప్రధాన ఆధారమని వెల్లడించారు. ఆ చరిత్రను ఆధునిక సాంకేతికతతో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశామని తెలిపారు.

Also Read:జమ్మూకశ్మీర్‌లో ప్రకృతి విలయం.. క్లౌడ్ బరస్ట్‌లతో భారీ నష్టం, 31 మంది మృతి..

ఈ సినిమాలో తన పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు ఇప్పటికే నిఖిల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. యోధుడి పాత్రలో కనిపించనున్న ఆయన కోసం యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్‌కు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శక్తిమాన్ సీరియల్‌తో దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపు పొందిన ఆయన పాత్ర సినిమా కథలో ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటుందని నిఖిల్ తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడం మంచి అనుభవమని కూడా చెప్పారు.

Also Read: ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మరో ట్విస్ట్… దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి..

ముఖేష్ ఖన్నా గతంలో తెలుగులో ధన 51, పురుషోత్తముడు చిత్రాల్లో నటించారు. చాలా సంవత్సరాల తర్వాత మరోసారి తెలుగు ప్రేక్షకులను స్వయంభు ద్వారా పలకరించనున్నారు. దీంతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న స్వయంభు చిత్రం నిఖిల్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. చారిత్రక నేపథ్యం, యాక్షన్ అంశాలు, విజువల్ గ్రాండియర్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు