ఎన్టీఆర్, క్రైమ్ మిర్రర్: కొండపల్లి శాంతినగర్ ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం గోదాంపై అధికారులు దాడి నిర్వహించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు మరియు రెవెన్యూ శాఖ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భారీగా బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకున్నారు.
శాంతినగర్‌లోని అభినందన ఫ్లాట్స్‌లో సుమారు 600 బస్తాల రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం పీడీఎస్ ఎస్ డీటీ రామకృష్ణ మాట్లాడుతూ, స్వాధీనం చేసుకున్న బియ్యం నిల్వలపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని తెలిపారు.ఈ కేసులో అక్రమ రవాణాకు సంబంధించి డేరంగుల గోపిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.