క్రైమ్ మిర్రర్ : కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో ఓ పరిశ్రమలో రసాయన వాయువు లీక్ కావడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. యాద్గిర్ జిల్లా సైదాపూర్ పరిధిలోని కడేచూర్-బడియాలా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. రాత్రి డ్యూటీలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా రసాయన వాయువు లీక్ కావడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు దాని ప్రభావానికి గురయ్యారు.
ఈ ఘటనలో విక్రమ్, సంజయ్, గణేష్ అనే ముగ్గురు కార్మికులు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో విక్రమ్, సంజయ్‌లు మధ్యప్రదేశ్‌లోని కత్ని జిల్లాకు చెందినవారు కాగా, గణేష్ తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అదే ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన హేమంత్, శివకుమార్ అనే మరో ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే రాయచూర్ రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై సైదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
also read : గుజరాత్‌లో చండీపుర వైరస్ కలకలం.. 22 మంది చిన్నారుల మృతి
