Homeజాతీయంత్వరలో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా.. అరెస్టైనా, చంపినా వెనక్కి తగ్గను: షేక్ హసీనా

త్వరలో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తా.. అరెస్టైనా, చంపినా వెనక్కి తగ్గను: షేక్ హసీనా

క్రైమ్ మిర్రర్ : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా త్వరలోనే స్వదేశానికి తిరిగి వెళ్తానని ప్రకటించారు. అక్కడికి వెళ్లిన తర్వాత తనను అరెస్టు చేసే అవకాశం ఉన్నా, ప్రాణహాని ఎదురైనా వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాల అనంతరం దేశం విడిచి భారత్‌లో ఆశ్రయం పొందిన షేక్ హసీనా, రెండేళ్ల తర్వాత బుధవారం వర్చువల్‌గా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన భవిష్యత్ కార్యాచరణపై స్పందిస్తూ, దేశ ప్రజల కోసం తాను తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్తానని తెలిపారు.

“నేను అధికారాన్ని తిరిగి పొందేందుకు కాదు.. బంగ్లాదేశ్‌ను సరైన దిశలో నడిపించేందుకు, అభివృద్ధి, లౌకికవాద విలువలను కాపాడేందుకు తిరిగి వెళ్తున్నాను. నన్ను జైలుకు పంపినా, హత్య చేసినా నా సంకల్పం మారదు” అని హసీనా పేర్కొన్నారు.2024 జూలై-ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమంపై కూడా ఆమె స్పందించారు. ఆ ఉద్యమం పూర్తిగా శాంతియుతంగా జరగలేదని, ప్రారంభం నుంచే ప్రభుత్వం చర్చలు, చట్టపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిందన్నారు. అయితే, కొన్ని సంఘాలు విద్యార్థుల ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చి రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నాయని ఆరోపించారు.

ఆ ఉద్యమం ఆకస్మికంగా జరిగినది కాదని, ముందస్తు ప్రణాళికతో సాగిందని హసీనా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియను పక్కనబెట్టి అధికారాన్ని చేజిక్కించుకునే లక్ష్యంతోనే ఈ పరిణామాలు జరిగాయని ఆమె విమర్శించారు. గత రెండేళ్లలో బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని హసీనా అన్నారు. దేశ అభివృద్ధి కోసం ఎన్నో ఏళ్లుగా చేసిన కృషి దెబ్బతింటోందని, స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది చేసిన త్యాగాల లక్ష్యం ఇదేనా అనే బాధ తనలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
also read : కర్ణాటకలో ఘోర ప్రమాదం.. రసాయన వాయువు లీక్‌తో ముగ్గురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు