Homeతెలంగాణగ్రేటర్ కు దూరంగా బండి సంజయ్...!

గ్రేటర్ కు దూరంగా బండి సంజయ్…!

  • కేంద్రమంత్రి దూకుడుకు కళ్లెం

  • గత ఎన్నికల్లో 48 డివిజన్లు గెలుపు వెనుక కృషి

  • ఇప్పుడు అదే నేతకు చుక్కెదురు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు హై కమాండ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ఆయనను దూరంగా ఉంచినట్లు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు మాత్రమే గ్రేటర్ ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: తెలంగాణ సిఎస్ గా జయేష్ రంజన్…! – Crime Mirror

బండి సంజయ్ కుమార్ అనుమతులు లేనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాదులో అన్ని తానై వ్యవహరించారు బండి సంజయ్. 48 డివిజన్లతో బిజెపిని గౌరవప్రదమైన రీతిలో ఉంచారు. అయితే అదే బండి సంజయ్ కు ఇప్పుడు గ్రేటర్ బాధ్యతలు లేకుండా పార్టీ హై కమాండ్ నియంత్రించడం హాట్ టాపిక్ అవుతోంది.

  • త్వరలో ఎన్నికలు

త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల సమయంలో వివిధ కారణాలతో ఆగిన మరికొన్ని కార్పొరేషన్లకు గ్రేటర్ హైదరాబాద్ తో పార్టీ ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో కమలం పార్టీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లు, వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: అన్నా డీఎంకే కు నటి గౌతమి గుడ్ బై…! – Crime Mirror

అయితే గ్రేటర్ ఎన్నికలకు బండి సంజయ్ ను హై కమాండ్ పూర్తిగా దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్క వరంగల్ కు మాత్రమే ఆయనను పరిమితం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై బండి సంజయ్ అనుచరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆవేదనతో ఉన్నారు.

  • విభేదాలతోనే..

బండి సంజయ్ కు ఇతర నేతలతో పడకపోవడం వల్లే ఆయనను హై కమాండ్ దూరం పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. ప్రధానంగా ఈటెల రాజేందర్ తో ఆయనకు విభేదాలు ఉన్నాయి. గతంలో గ్రేటర్ ఎన్నికల విషయంలో ఇతరుల జోక్యం వద్దని.. హైదరాబాద్ పరిధికి సంబంధించి ఎంపీలకు బాధ్యత ఇవ్వాలని ఈటెల రాజేందర్ పార్టీ హై కమాండ్ ను కోరారు.

Also Read: బొగ్గు చోరీ సాధ్యమేనా…? – Crime Mirror

పరోక్షంగా బండి సంజయ్ వస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు బండి సంజయ్ కుమారుడు ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత ఆయనకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆ వివాద సమయంలోనే ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో సైతం బండి సంజయ్ పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ప్రధాని పర్యటనకు ఆయనను దూరంగా ఉంచారు.

  • ఆయన కృషితోనే…

గతంలో గ్రేటర్ ఎన్నికల్లో అన్ని తానై వ్యవహరించారు బండి సంజయ్. భారతీయ జనతా పార్టీకి 48 డివిజన్లు రావడం వెనుక బండి సంజయ్ కృషి ఉంది. ఆ ఎన్నికలతోనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక ఊపు వచ్చింది. అదే నాయకుడిని ఇప్పుడు దూరం పెట్టడం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతోంది.

మరోవైపు బండి సంజయ్ ను కేంద్రమంత్రి పదవి నుంచి కూడా తొలగిస్తారు అన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. అదే జరిగితే బండి సంజయ్ తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Also Read: తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది… కేంద్ర మంత్రి బండి సంజయ్ – Crime Mirror

Also Read: ఇండియన్ థియేటర్ల ముందు యూరప్ థియేటర్లు ఫెయిల్ ? – Crime Mirror

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు