Homeతెలంగాణబొగ్గు చోరీ సాధ్యమేనా...?

బొగ్గు చోరీ సాధ్యమేనా…?

  • సింగరేణి కాలరీస్ పై గులాబీ అగ్ర నేతల ఆరోపణలు

  • వెనుక ముందు చూసుకోకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ కు లేఖ..

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: సింగరేణి బొగ్గు గనుల చుట్టూ ఇప్పుడు జాతీయస్థాయి రాజకీయం ముదురుతోంది. సింగరేణి పరిధిలోని ఏడు ప్రధాన గనుల్లో దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు రికార్డుల్లో చూపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో భౌతికంగా ఆ బొగ్గు మాయమైంది అంటూ గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

దీనిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి జూన్ 13న సీఎం రేవంత్ రెడ్డికి అధికారికంగా లేఖ రాశారు. దీంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. రాత్రికి రాత్రే ఇన్ని లక్షల టన్నుల బొగ్గు దాటి వెళ్లిపోయిందా? అది సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది.

  • ఎలా చూసినా అసాధ్యమే

రాజకీయ ఆరోపణలు చేయడంలో భాగంగానే బొగ్గుపై రాద్దాంతం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు చోరీ సాధ్యమయ్యే పని కాదు అని నిపుణుల మాట. సాధారణంగా ఒక పెద్ద లారీ 20 నుంచి 25 టన్నుల బొగ్గును మోయగలదు. అంటే 40 లక్షల టన్నుల బొగ్గును రోడ్డు మార్గంలో తరలించారు అంటే దాదాపు రెండు లక్షల లారీలు కావాలి.

Also Read: ప్రైమ్ వీడియో “ఇసకపట్నం” చిత్ర ట్రైలర్ విడుదల…! – Crime Mirror

పోనీ రైల్వే వ్యాగన్ల ద్వారా తరలించారు అంటే… ఒక గూడ్స్ రైలు గరిష్టంగా 3800 నుంచి 4వేల టన్నుల బుక్కును మాత్రమే తీసుకెళ్లగలదు. ఈ లెక్కన 40 లక్షల టన్నుల రవాణా కావాలంటే ఏకంగా వెయ్యికి పైగా గూడ్స్ రైలు కావాలి. రైల్వే అత్యంత పెద్ద ప్రాజెక్ట్. ఎంతో కనెక్టివిటీ ఉండాలి. ఒక రాత్రిలో 1000 గూడ్స్ తరలించాలంటే సాధ్యమయ్యే పని కాదు.

అందుకే ఇది నమ్మసక్యం అయ్యే ఆరోపణ కాదు అనేది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. గులాబీ అగ్రనేతలు చేస్తున్న అతి ప్రచారం.. దానిని సాకుగా తీసుకొని బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి కి లేఖ రాయడం చూస్తుంటే దీని వెనుక ఏ స్థాయిలో రాజకీయం జరుగుతుందో అర్థం అవుతోంది.

  • అమ్మకం కుదరదు..

బొగ్గును ఇష్టారాజ్యంగా అమ్ముతాం అంటే కుదరదు. పేరు మోసిన సిమెంటు కంపెనీలు, జెన్కో విద్యుత్ ప్లాంట్లు, అనుమతులు ఉన్న పరిశ్రమలే ఈ బొగ్గును కొనుగోలు చేయాలి. అది కూడా క్వాలిటీ కంట్రోల్ తో పాటు కొన్నిరకాల అనుమతులు పొందిన తర్వాత మాత్రమే బొగ్గును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇదేదో బొగ్గు కిరాణా వస్తువు అన్నట్టు కేటీఆర్, హరీష్ రావు ఆరోపణలు చేయడం విమర్శలకు తావిస్తోంది.

Also Read: అమెజాన్ ఉద్యోగం వదిలేసి.. క్యాబ్ డ్రైవర్‌గా మారిన టెకీ, కారణం తెలిసి నెటిజన్లు ఫిదా!! – Crime Mirror

దీనిపై వెనుక ముందు చూసుకోకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి కి లేఖ రాయడం మరింత విమర్శలకు గురిచేస్తోంది. బాధ్యతాయుతమైన బొగ్గు శాఖామంత్రిగా ఉంటూ.. అసలు నమ్మశక్యంగా లేని ఆరోపణలు.. ఆధారాలు దొరకని వాటిపై స్పందించడం ఏంటన్న చర్చ నడుస్తోంది. ఇప్పటికే భారత రాష్ట్ర సమితితో బిజెపి పొత్తు పెట్టుకుంటుందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది.

వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న టాక్ ఉంది. దీనిపైనే సీఎం రేవంత్ గట్టి ఆరోపణలు చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆయనకు అవకాశం ఇస్తూ అటు గులాబీ పార్టీ అగ్ర నేతలు.. బిజెపికి పెద్దదిక్కుగా ఉన్న కేంద్ర మంత్రి వ్యవహరిస్తుండడం మాత్రం ఆ రెండు పార్టీలకు ఇబ్బందికరమే.

Also Read: ప్రకాష్ రాజ్ పై క్రిమినల్ కేసు…! – Crime Mirror

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు