Homeక్రీడలువైభవ్ ను పొగడొద్దు.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు!

వైభవ్ ను పొగడొద్దు.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ :- టీమ్ఇండియా తుది జట్టులో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కకపోవడంపై క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ స్పందించారు. వైభవ్ ప్రతిభను ప్రశంసిస్తూనే, అతడిపై అనవసర ఒత్తిడి తీసుకురావొద్దని సూచించారు.ఒక ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘వైభవ్‌లో ఎంతో ప్రతిభ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, అతడి గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నామని అనిపిస్తోంది. అతడికి కాస్త సమయం ఇవ్వాలి. ఎక్కువగా హైప్ చేయొద్దు. అన్ని విషయాలు అర్థం చేసుకొనేంత వయసు వైభవ్‌కు ఇంకా రాలేదు. అతడు ఆడేందుకు మానసికంగా సిద్ధంగా ఉంటే, వయసును కాకుండా సామర్థ్యాన్ని మాత్రమే చూడండి’ అని పేర్కొన్నారు.యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం మంచిదే అయినప్పటికీ, వారిపై అంచనాల భారం మోపడం వారి కెరీర్‌పై ప్రభావం చూపుతుందని కపిల్ దేవ్ పరోక్షంగా సూచించారు.

ప్రభాస్ ‘స్పిరిట్’ అప్‌డేట్.. శరవేగంగా షూటింగ్!

తన సంకల్పం.. 116 ఏళ్ల వయస్సులోనూ ఎంచక్కా తిరుమల కొండ ఎక్కేసింది..!!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు