Homeతెలంగాణరేవంత్ టార్గెట్ బిజెపి...!

రేవంత్ టార్గెట్ బిజెపి…!

  • మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఎన్వోసీలు తీసుకురండి

  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ సవాల్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: మరోసారి సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని డిఫెన్స్ లో పెట్టారు. గత కొంతకాలంగా ఆయన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అభివృద్ధిని బిజెపి అడ్డుకుంటుందని ఇటీవల ఆరోపణలు చేస్తూ వచ్చారు రేవంత్.

దీనిని మరింత పదును పెట్టారు. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ వ్యవహారం పై కేంద్రమంత్రి కిసాన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్ర ప్రభుత్వ వైఖరితో పాటు రాష్ట్రం పట్ల బిజెపి అనుసరిస్తున్న విధానాన్ని తప్పు పడుతూ మాట్లాడారు. తద్వారా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో డిఫెన్స్ లో పడేసే ప్రయత్నం చేశారు.

  • రాష్ట్రమే భరిస్తుంది..

హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించిన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదని.. ఎన్వోసీ ఇస్తే చాలని.. మీ 50% భాగస్వామ్యం కూడా మాకు వద్దని.. రాష్ట్ర ప్రభుత్వమే మూడో దశ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుందని తేల్చి చెప్పారు.

Also Read: యువ న‌టికి లైంగిక వేధింపులు…!కేసు న‌మోదు – Crime Mirror

ఇదే విషయం ఢిల్లీ వెళ్లి చెబితే.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చాలా తేలిగ్గా మాట్లాడాలని.. ఎన్ ఓ సి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కట్టుకుంటే తెలంగాణలో బిజెపి ఉనికి ఉండదని కేంద్రమంత్రి తనతో అన్న విషయాన్ని లీక్ చేశారు. తద్వారా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న విషయాన్ని బయటపెట్టారు. పనిలో పనిగా మరోసారి కిషన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. తన వెనుకబడి కిషన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.

  • కిషన్ రెడ్డి పై సెటైర్స్..

ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాని పైన కూడా సెటైరికల్ గా స్పందించారు సీఎం రేవంత్. దమ్ముంటే ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి మెట్రో రైల్ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకురండి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. గతంలో కెసిఆర్ మాదిరిగా మిమ్మల్ని రండ అని తిట్టానా? అంటూ పాత అంశాలను ప్రస్తావించారు. వైజాగ్ మెట్రో అనుమతులపై కూడా స్పందించారు.

Also Read: భోజనం తర్వాత ఈ పని తప్పనిసరిగా చేయండి…! – Crime Mirror

జూబ్లీహిల్స్, మాదాపూర్ కలిపితే ఎంత ఉంటుందో.. వైజాగ్ అంతే ఉంటుందని.. దానికి మెట్రో అనుమతులు వచ్చాయని.. హైదరాబాద్కు ఎందుకు రావు అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ పై ఎందుకంత వివక్షాన్ని ప్రశ్నించారు. మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పై కూడా సెటైర్లు పేల్చారు. చత్రపతి సినిమాలో వేణుమాధవ్ అపరిచితుడు గెటప్ వేసి బెదిరించినట్లు ఆయన నన్ను బెదిరిస్తున్నారు అంటూ నవ్వులు పూయించారు.

హైదరాబాదును గ్లోబల్ సిటీగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రవాణా సౌకర్యాలకు కోసం మెట్రో ప్రాజెక్టును ఏమాత్రం వదిలిపెట్టి ప్రసక్తి లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని తేల్చి చెప్పారు.

Also Read: జాతీయ పార్టీగా జనసేన…! – Crime Mirror

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు