Homeఆంధ్ర ప్రదేశ్పొలిటికల్ జంక్షన్ లో షర్మిల...!

పొలిటికల్ జంక్షన్ లో షర్మిల…!

  • కాంగ్రెస్ మాట తప్పిందని ఆవేదన

  • పదవి రాకుండా జగన్ అడ్డుకున్నారని అనుమానం

  • రాజకీయ భవిష్యత్ పై ఆందోళన

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుంది అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన రాజ్యసభ నామినేషన్ల పర్వంలో ఆమెకు స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆమె చేసిన ఒక ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చకు దారితీసింది.

మాట ఇచ్చిన వారికి.. తీసుకున్న వారికి మధ్య ఉన్న మ్యాటర్ అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణం అవుతున్నాయి. అధిష్టానం తనకు ఇచ్చిన హామీలు వెనక్కి తీసుకుందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. మరోవైపు తీవ్ర అభద్రతాభావంతో ఆమె బాధపడుతున్నట్లు ఆమె ట్వీట్ ద్వారా అర్థం అవుతోంది.

  • జగన్ పై అనుమానం..

కర్ణాటక నుంచి తనకు రాజ్యసభ పదవి రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారన్న అనుమానం వ్యక్తం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి జాతీయస్థాయిలో తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఇండియా కూటమికి దగ్గర కావడం.. లేకుంటే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడమో చేస్తారన్న భావన వ్యక్తం అవుతోంది.

Also Read: సిగరెట్ కన్నా అగరబత్తి పొగ ఆరోగ్యానికి హానికరమా…?

ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని విభేదించిన మమతా బెనర్జీ లాంటి వారే మళ్లీ దగ్గరవుతున్న రోజులు ఇవి. అదే జరిగితే తన పరిస్థితి ఏంటన్న ఆందోళనతో ఆమె ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఇన్ని రోజులు తన సోదరుడు జగన్మోహన్ రెడ్డితో పోరాడి.. ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేయడం అనేది అసాధ్యం. అందుకే షర్మిల పొలిటికల్ జంక్షన్ లో నిలబడినట్లు అర్థం అవుతోంది.

  • పరస్పరం మారుతున్న వైఖరి..

జాతీయ స్థాయిలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన మారింది. ఆయన విషయంలో కాంగ్రెస్ పార్టీ సైతం తన ఆలోచన మార్చుకుంది. అవసరం అనేది రాజకీయాల్లో కీలకం కాబట్టి.. ఇప్పుడు అదే అవసరాన్ని వాడుకొని ఆయన కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతారు. కాంగ్రెస్ పార్టీ సైతం ఆయనను దగ్గరకు చేర్చుకుంటుంది.

Also Read: ఉచిత పాఠ్య‌పుస్త‌కాల‌ను విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకోవాలి…!

సరిగ్గా ఇదే సమయంలో షర్మిలకు వచ్చినట్టే వచ్చి రాజ్యసభ రాకుండా పోయింది. ఒకవేళ తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో కలిస్తే తన పొలిటికల్ కెరీర్ క్లోజ్. అయితే ఇప్పటికిప్పుడు రాజ్యసభ ఛాన్స్ వచ్చే అవకాశం లేదు ఆమెకు. అందుకే భవిష్యత్తు రాజకీయాన్ని అంచనా వేసుకుని ఆమె సైలెన్స్ పాటిస్తారా? లేకుంటే మరో రాజకీయ వేదికను ఎంచుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం పరిస్థితులు చూస్తుంటే మాత్రం షర్మిల పొలిటికల్ జంక్షన్ లో నిలబడినట్టే.

Also Read: సారూ..నన్ను నా కొడుకు నుంచి రక్షించండి…! వృద్దురాలి క‌న్నీటి విన‌తి…..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు