Homeఅంతర్జాతీయంపెళ్లి వేడుకలో భారీ అగ్నిప్రమాదం.. 22 మంది మృతి

పెళ్లి వేడుకలో భారీ అగ్నిప్రమాదం.. 22 మంది మృతి

క్రైమ్ మిర్రర్ : డెమోక్రటిక్ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో రాజధాని కిన్షాసాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లింగ్వాలా కమ్యూన్‌లో నిర్వహిస్తున్న వివాహ వేడుకలో భారీగా మంటలు చెలరేగడంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. స్థానిక అధికారుల వివరాల ప్రకారం.. ఉదయం పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడ ఉన్నవారు బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రమాదంలో ఇప్పటివరకు 22 మంది మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మంటల తీవ్రతకు వేడుక జరుగుతున్న భవనంలోని భారీ మొత్తంలో సామగ్రి, ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
also read : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు