Homeతెలంగాణకేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు కన్నుమూత.. విషాదంలో కేసీఆర్ కుటుంబం

కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు కన్నుమూత.. విషాదంలో కేసీఆర్ కుటుంబం

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో విషాదం నెలకొంది. కేసీఆర్ సతీమణి శోభ సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేనమామ జోగినపల్లి శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

శ్రీనివాసరావు మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని సుచిత్రలోని నివాసానికి తరలించారు. శ్రీనివాసరావు కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో.. ఆయన స్వదేశానికి వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కుటుంబ వర్గాల సమాచారం.

కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్, హరీశ్‌రావు

మామ శ్రీనివాసరావు మరణవార్త తెలుసుకున్న కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తమ కార్యక్రమాలను రద్దు చేసుకుని సుచిత్రలోని నివాసానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంతాపాన్ని తెలిపారు. ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకుని శ్రీనివాసరావు పార్థివదేహానికి నివాళులర్పించారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు యశోద ఆస్పత్రికి వెళ్లి శ్రీనివాసరావు పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

కామారెడ్డి ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన శ్రీనివాసరావు

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సమయంలో జోగినపల్లి శ్రీనివాసరావు అక్కడే ఉండి ఎన్నికల వ్యవహారాలను సమన్వయం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ కుటుంబానికి ఆయన ఎంతో సన్నిహితంగా ఉండేవారని బీఆర్ఎస్ నాయకులు గుర్తుచేసుకున్నారు.

ఇటీవలే కేసీఆర్‌కు సన్నిహితుడైన పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి చెందగా.. తాజాగా బావమరిది శ్రీనివాసరావు మృతితో కేసీఆర్ కుటుంబంలో మరోసారి విషాదం నెలకొంది.

also read: కదిరిలో హైడ్రామా.. పోలీసుల అరెస్ట్‌కు ముందే కుటుంబం ఆత్మహత్యాయత్నం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు