క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఒకప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవే పనులను పునరావృతం చేస్తోందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందిస్తూ అధికార పార్టీ అనుసరిస్తున్న ప్రచార వ్యూహాలను తప్పుబట్టారు.తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో ఎంతో బలమైన, సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కార్యకర్తల బలం ఉందని గుర్తుచేసిన ఆయన, తమ ప్రభుత్వ పనులను, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయడానికి డబ్బులిచ్చి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను నియమించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని సూటిగా ప్రశ్నించారు. ఒక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజలకు నిజంగా మేలు జరిగితే, ఆ లబ్ధిదారుల అనుభవాలే ప్రభుత్వానికి అతిపెద్ద ప్రచార సాధనాలుగా మారుతాయని ఆయన స్పష్టం చేశారు.
‘పాలిచ్చే బర్రెను వదిలి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు’: ప్రభుత్వంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
నిజమైన సుపరిపాలన ఎప్పుడూ తన ప్రతినిధులను, మద్దతుదారులను ప్రజల్లో నుంచే వాటంతట అవే సృష్టించుకుంటుందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. పారదర్శకమైన పాలన అందిస్తే ప్రజలే స్వచ్ఛందంగా ప్రభుత్వ విజయాలను నలుగురికీ వివరిస్తారని, అలాకాకుండా ప్రత్యేకంగా డబ్బులు చెల్లించి ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా కృత్రిమంగా ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితి రాజకీయ పార్టీలకు రాకూడదని ఆయన హితవు పలికారు. బలమైన క్యాడర్ ఉన్న పార్టీలు ప్రజల నమ్మకాన్ని చూసుకోవాలి తప్ప, పెయిడ్ ప్రచారాలను నమ్ముకోకూడదని ఆయన పేర్కొన్నారు.
బులియన్ మార్కెట్‌లో దిగివచ్చిన పసిడి, వెండి ధరలు: లభించిన ఊరట!
