క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం 40 అడుగుల వద్ద ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.61 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రవాహం మరింత పెరిగి 8 నుంచి 9 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వరద ఉద్ధృతి కారణంగా వాగులు, కల్వర్టులు, కాజ్ వేలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆయా మార్గాల్లో ప్రమాదకరమైన ప్రయాణాలు చేయొద్దని APSDMA ప్రజలను హెచ్చరించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రైతులు, మత్స్యకారులు నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లరాదని ఆదేశాలు జారీ అయ్యాయి.
బులియన్ మార్కెట్‌లో దిగివచ్చిన పసిడి, వెండి ధరలు: లభించిన ఊరట!
