క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రజలు పాలించే, మేలు చేసే బర్రె లాంటి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి, తన్నే దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారంటూ కాంగ్రెస్ పాలనపై ఆయన సంచలన సెటైర్లు వేశారు.గత మూడేళ్లుగా కేసీఆర్ బయటకు రాకపోయినప్పటికీ, రాష్ట్ర ప్రజల్లో ఆయనకున్న ప్రజాదరణ కొంచెం కూడా తగ్గలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం ఎప్పటికీ భద్రంగానే ఉందనడానికి ఇటీవల జరిగిన గణేష్ నిమజ్జన వేడుకలే నిదర్శనమని చెప్పారు. ఊరేగింపుల్లో ఎక్కడ చూసినా, ఏ వీధిలో విన్నా కేసీఆర్ పాటలే మారుమోగాయని ఆయన గుర్తుచేశారు.
ఏషియన్ గేమ్స్: క్వార్టర్స్‌లోనే నిష్క్రమించిన పీవీ సింధు..!
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేసుకోవడానికి పూర్తి అవకాశం ఇవ్వాలని, వారి పనితీరులో అనవసరంగా జోక్యం చేసుకుంటూ కాళ్లల్లో కట్టెలు పెట్టకూడదనే ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రస్తుతం బయటకు రావడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ ప్రజలు ఇప్పటికే గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని గ్రహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వెళ్తే ఇల్లు గుల్ల చేశారు.. ఖమ్మం జిల్లాలో దొంగల బీభత్సం!
