క్రైమ్ మిర్రర్, సినిమా:- న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘ప్యారడైజ్’ చిత్రం థియేటర్లలో సందడి చేస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. అయితే, ప్రారంభ రోజులతో పోలిస్తే ఈ సినిమా కలెక్షన్లు మూడో రోజున కాస్త తగ్గుముఖం పట్టాయి.
అంగన్వాడీల నుంచి నెలమామూళ్లు.. ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సీడీపీవో!
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తొలి రెండు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ.114 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఇక మూడో రోజున ఈ మూవీ మరో రూ.22 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దీంతో మొత్తంగా తొలి మూడు రోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.136 కోట్ల గ్రాస్ మార్కును సాధించినట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేస్తూ ప్రకటించారు. సినిమా కలెక్షన్లలో స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ, వారాంతంలో సాధించిన ఈ భారీ గ్రాస్ వసూళ్లు బాక్సాఫీస్ వద్ద సినిమా స్థిరత్వాన్ని నిరూపిస్తున్నాయి.
ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వెళ్తే ఇల్లు గుల్ల చేశారు.. ఖమ్మం జిల్లాలో దొంగల బీభత్సం!
