Homeక్రైమ్అంగన్‌వాడీల నుంచి నెలమామూళ్లు.. ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సీడీపీవో!

అంగన్‌వాడీల నుంచి నెలమామూళ్లు.. ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సీడీపీవో!

క్రైమ్ మిర్రర్ : ప్రభుత్వ ఉద్యోగం పేద ప్రజలకు సేవ చేయడానికి అనుకుంటే, కొందరు అధికారులకు మాత్రం అది అక్రమ సంపాదనకు మార్గంగా మారుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేస్తూ అవినీతికి అలవాటుపడిన ఓ ఉన్నతాధికారిణి ఎట్టకేలకు ఏసీబీ వలలో చిక్కారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్ (సీడీపీవో) దరోజు పద్మా లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని 21 అంగన్‌వాడీ కేంద్రాల్లో అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సమయంలో కేంద్రాలకు వ్యతిరేకంగా ఎలాంటి నివేదికలు తయారు చేయకూడదంటే లంచం ఇవ్వాలని సీడీపీవో పద్మ డిమాండ్‌ చేశారు. ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం నుంచి నెలకు రూ. 1,000 చొప్పున, మూడు నెలలకు కలిపి మొత్తం రూ. 63,000 లంచంగా ఇవ్వాలని ఆమె ఒత్తిడి తెచ్చారు.
అధికారిణి వేధింపులు తాళలేక బాధితుడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం శనివారం బాధితుడి నుంచి సీడీపీవో పద్మ రూ. 63 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసిన అధికారులు, కరీంనగర్‌ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు హెచ్చరించారు.
also read : చికెన్ వండే విషయంలో తీవ్ర గొడవ.. తల్లిదండ్రుల ఘర్షణ చూసి ఆరేళ్ల చిన్నారి షాక్‌తో మృతి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు