Homeక్రైమ్విషాదం.. కోనేరులో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి

విషాదం.. కోనేరులో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి

విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మెరకముడిదాం మండలం బుధరాయవలస గ్రామంలో స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు కోనేరులో మునిగి మృతి చెందారు. మృతులంతా ఏడేళ్ల వయసు వారే కావడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

బుధరాయవలసకు చెందిన శంకరపు వెంకటేశ్ (7), సారిది చందు (7), మండల హేమచంద్రరావు (7) స్నేహితులు. వీరు గ్రామంలోని కోనేరు వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే నీటి లోతు తెలియకపోవడంతో ముగ్గురూ ప్రమాదవశాత్తు నీటిలోకి జారిపోయినట్లు సమాచారం.

చిన్నారులు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గ్రామస్థులతో కలిసి కోనేరు పరిసరాల్లో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలను గుర్తించి బయటకు తీసుకొచ్చారు.

ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు ఒకేసారి మృతి చెందడంతో బుధరాయవలసలో తీవ్ర విషాదం అలుముకుంది. తమ పిల్లలను కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

also read: కేటీఆర్ ప్రశంసలు.. ప్రియదర్శి రిప్లై.. సోషల్ మీడియాలో ‘ప్యారడైజ్’పై ఆసక్తికర సంభాషణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు