Homeక్రీడలురోనాల్డోకి ఇదే చివరి వరల్డ్ కప్.. హింట్ ఇచ్చిన సోదరి!

రోనాల్డోకి ఇదే చివరి వరల్డ్ కప్.. హింట్ ఇచ్చిన సోదరి!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు ఇదే చివరి వరల్డ్ కప్ కావొచ్చని ఆయన సోదరి కటియా ఏవీరో తెలిపారు. రొనాల్డో రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలకు ఆమె వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి.ఆమె మాట్లాడుతూ, “నాకున్న సమాచారం మేరకు ఇదే అతడి చివరి టోర్నీ. ఈ మూమెంట్‌ను ఎంజాయ్ చేయండి. త్వరలో దీనికి ముగింపు పడబోతోంది” అని అన్నారు. రొనాల్డో భవిష్యత్తు ప్రణాళికలపై కటియా చేసిన ఈ వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.ఇక ప్రస్తుత WCలో రొనాల్డో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంపై వస్తున్న విమర్శలపైనా ఆమె స్పందించారు. “ఫుట్‌బాల్‌ను ఇష్టపడేవారికి ఆయన విలువ తెలుస్తుంది. గత 20 ఏళ్లుగా రొనాల్డో ఫుట్ బాల్ ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఇతరుల విమర్శలు మా ఫ్యామిలీ సంతోషాన్ని ఆపలేవు” అని ఆమె స్పష్టం చేశారు. రొనాల్డో తన కెరీర్ లో సాధించిన విజయాలే అతని స్థాయిని తెలుపుతాయని ఆమె పరోక్షంగా పేర్కొన్నారు.

బుచ్చిబాబుతో మరో సినిమాకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్!

క్షణికావేశంలో విషాదం.. రైలు కిందపడి దంపతుల మృతి!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు