Homeఆంధ్ర ప్రదేశ్APలో మండిపోతున్న కూరగాయల ధరలు..!

APలో మండిపోతున్న కూరగాయల ధరలు..!

క్రైమ్ మిర్రర్, అమరావతి:- వేసవి కాలం ముగిసి, వర్షాలు పడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో కూరగాయల ధరలు మాత్రం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడినా, మార్కెట్లో మాత్రం కూరగాయల ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క టమాటా మినహా దాదాపు అన్ని కూరగాయల ధరలు కిలో రూ.100 కు చేరువలో ఉన్నాయి. ప్రధానంగా క్యాప్సికం, చిక్కుడు ధరలు ఇప్పటికే సెంచరీ దాటగా, క్యారెట్ ధర కిలోకు రూ.80 గా పలుకుతోంది. ఇక బీట్‌రూట్, పచ్చిమిర్చి కిలో రూ.60 కి చేరాయి. అల్లం, వెల్లుల్లి ధరలు సైతం అమాంతం పెరిగాయి. కిలో రూ.140 నుంచి రూ.150 వరకు ఉన్న అల్లం, వెల్లుల్లి ధరలు ప్రస్తుతం రూ.200 నుంచి రూ.220 కు చేరాయి. టమాటా మాత్రమే కిలో రూ.40 పలుకుతూ కాస్త ఊరటనిస్తోంది.ధరల పెరుగుదలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిటైల్ వ్యాపారుల అత్యాశ కారణంగానే ధరలు పెంచుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ధరలను నియంత్రించాలని కోరుతున్నారు.

క్షణికావేశంలో విషాదం.. రైలు కిందపడి దంపతుల మృతి!

రోనాల్డోకి ఇదే చివరి వరల్డ్ కప్.. హింట్ ఇచ్చిన సోదరి!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు