Homeరాజకీయం35 ఏళ్లకే టాలీవుడ్‌ హీరోయిన్ మృతి... ! నెల రోజుల తర్వాత బయటపడ్డ విషాద వార్త...

35 ఏళ్లకే టాలీవుడ్‌ హీరోయిన్ మృతి… ! నెల రోజుల తర్వాత బయటపడ్డ విషాద వార్త…

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌: తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన నటి అనన్య రాజ్‌ 35 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె మరణవార్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అభిమానులు, సినీ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. గత నెల 15న అనన్య నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూసినట్లు తెలిపారు. అనన్య కొంతకాలంగా శారీరక, మానసిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వాటి నుంచి బయటపడేందుకు ఆమె పోరాడుతున్న సమయంలోనే ఈ విషాదం చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆమె మరణానికి ఖచ్చితమైన వైద్య కారణాన్ని కుటుంబం వెల్లడించలేదు. ఈ సమయంలో తమ గోప్యతను గౌరవించాలని అభిమానులు, మీడియాను కుటుంబ సభ్యులు కోరారు.

Also Read:వృషకర్మ టీమ్‌కు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. రిలీజ్‌పై దర్శకుడి కీలక అప్‌డేట్…!

అనన్య రాజ్ మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 18 ఏళ్ల వయసులోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె పలు ప్రముఖ బ్రాండ్ల వాణిజ్య ప్రకటనల్లో కనిపించారు. లాక్మే, కోకా కోలా, లక్స్, శామ్‌సంగ్, జాబాంగ్, ఊబర్, అమెజాన్ వంటి సంస్థల ప్రకటనల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. మోడలింగ్‌లో మంచి గుర్తింపు వచ్చిన తర్వాత అనన్య సినిమాల్లోకి ప్రవేశించారు. 2018లో వచ్చిన ది ఫైనల్ ఎగ్జిట్ చిత్రంలో కునాల్ రాయ్ కపూర్ సరసన నటించారు. అనంతరం ఘోస్ట్ అనే హారర్ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. హిందీ సినిమాలతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించారు. నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తగ్గేదే లే సినిమాలో అనన్య కీలక పాత్రలో కనిపించారు. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయమయ్యారు. సినిమాలతో పాటు పలు మ్యూజిక్ వీడియోల్లోనూ నటించిన ఆమె, ఘాలిబ్ అనే మ్యూజిక్ వీడియోకు దర్శకత్వం కూడా వహించారు.

Also Read:భారత్‌లో వయసు పెరగని హీరోలు ఇద్దరే.. సూర్య, మహేష్‌పై త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్…!

ముంబైలో పెరిగిన అనన్యకు ఇద్దరు సోదరులు ఉన్నారు. ఎస్వీ హైస్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె అనంతరం పట్కర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. షారుఖ్ ఖాన్ ఆమె అభిమాన నటుడు కాగా, హాలీవుడ్ నటి జెందయా అంటే ఎంతో ఇష్టమని గతంలో చెప్పినట్లు సమాచారం. సినీ కెరీర్‌లో మరింత ముందుకు వెళ్లాల్సిన సమయంలోనే అనన్య మృతి చెందడం అభిమానులను విషాదంలోకి నెట్టింది. ఆమె మృతిపై పలువురు సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు