-
ప్రకృతి విపత్తుల చుట్టూ తెలంగాణ రాజకీయం
-
బిఆర్ఎస్ వ్యూహాన్ని తిప్పి కొట్టిన రేవంత్
-
పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో వర్షాలు పడకూడదని క్షుద్ర పూజలు
-
హరీష్ రావు పై వ్యూహాత్మక ఎదురుదాడి
-
కాంగ్రెస్ ను ఎదుర్కోలేక చతికిలపడిన గులాబీ పార్టీ నేతలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో కరువు చుట్టూ ఇప్పుడు రాజకీయాలు తిరుగుతున్నాయి. ప్రధానంగా నమ్మకాలు, మూఢ నమ్మకాలు చుట్టూ రాజకీయాలను తిప్పుతున్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడం, వర్షాభావ పరిస్థితులు ఏర్పడడానికి రేవంత్ సర్కార్ పాపంగా ప్రచారం చేశారు గులాబీ పార్టీ నేతలు. పాలన మార్పుతోనే ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయని.. ఇది రేవంత్ తెచ్చిన కరువు అని సీనియర్ నేతలు వ్యూహాత్మకంగా విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శను గట్టిగానే తిప్పికొట్టారు రేవంత్. గ్రామీణ ప్రజల్లో ఉండే నమ్మకాలనే రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు. పొరుగు రాష్ట్రాల్లో పూజలు జరిపి తెలంగాణలో వర్షాలు పడకూడదని.. ప్రభుత్వం పడిపోవాలని గులాబీ పార్టీ కీలక నేత పూజలు జరిపారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రకృతి వైపరీత్యాన్ని ప్రతిపక్షల కుట్రగా చిత్రీకరించడం ద్వారా.. ప్రతిపక్షం విసిరిన బాణాన్ని వారికి తగిలేలా చేశారు.
రేవంత్ పాలనతో అంటూ…
Also Read:స్వాతంత్ర్య స్ఫూర్తితో మార్మోగిన మర్రిగూడ మండలం…!
తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. గులాబీ పార్టీ నేతలు సరికొత్త వ్యూహరచన చేశారు. ఇదంతా రేవంత్ రెడ్డి పాలన పుణ్యం అంటూ ప్రజల్లో సెంటిమెంట్ రేపే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పక్క రాష్ట్రాల్లో ఆలయాల సందర్శనకు వెళ్లారు హరీష్ రావు. దానిని కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా వాడుకున్నారు. తెలంగాణలో కరువు ఏర్పడాలని, ప్రభుత్వ పడిపోవాలని క్షుద్ర, అఘోర పూజలు జరిపాలంటూ ఆరోపించడం ప్రారంభించారు. ఈ ఊహించని మైండ్ గేమ్ తో గులాబీ పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడిపోయారు. ఎదురు దాడి చేయాల్సిన చోట హరీష్ రావు వంటి సీనియర్ నేతలు ఈ ఆరోపణను రాజకీయంగా ఎదుర్కొనలేకపోయారు. ఆరోపణలను నిరూపించకపోతే లీగల్ నోటీసులు ఇస్తాం. కోర్టుకు ఏడుస్తాం అని హెచ్చరించడం వారి రాజకీయ భయాందోళనను బహిర్గతం చేస్తోంది. క్షేత్రస్థాయి మాస్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి విసిరిన ఎత్తుకు సమాధానం చెప్పలేక లీగల్ మార్గాన్ని ఎంచుకున్నారు హరీష్ రావు. దీంతో ఇది గులాబీ పార్టీ శ్రేణులకు సైతం మింగుడు పడడం లేదు.
రేవంత్ రివర్స్ పంచ్…
Also Read:వృషకర్మ టీమ్‌కు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్.. రిలీజ్‌పై దర్శకుడి కీలక అప్డేట్…!
అయితే సరికొత్తగా ఈ ప్రకృతి వైపరీత్యాలను రాజకీయాలకు వాడుకోవడం తెలంగాణలో కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో సైంటిఫిక్ టెంపర్, పాలన పురోగతి ఆధారంగా చర్చలు జరగాలి. తెలంగాణ రాజకీయాల్లో ప్రజల్లో ఉన్న నమ్మకాలు, అపోహలను పొలిటికల్ మైండ్ గేమ్ లకు వాడుకోవడంతో ఇరు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఎదుటివారు వేసిన పాచికను తిరిగి వారిపై తిప్పడంలో రేవంత్ రెడ్డి ముందుంటారు. నాలుగు ఆకులు ఎక్కువ చదివారు. ప్రతిపక్షం ఈ అంశంతో తనపై దాడికి దిగుతాందో.. అదే అంశంతో ఎదురు దాడి చేయడంలో రేవంత్ సిద్ధహస్తుడు. ఇప్పుడు తాజాగా కూడా ఇది రుజువైంది
