క్రైమ్ మిర్రర్ : ఎన్నో ఆశలు, ఆశయాలతో కొత్త ఇంటిని నిర్మించుకున్న ఆ కుటుంబానికి విధి తీరని విషాదాన్ని మిగిల్చింది. నెల రోజుల క్రితమే నూతన గృహ ప్రవేశం చేసి ఆనందంగా కొత్తింట్లో అడుగుపెట్టిన కుటుంబంలో ఊహించని ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యుత్ షాక్‌కు గురై గృహిణి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జనగం రూప (30) శుక్రవారం ఉదయం విద్యుత్ షాక్‌కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
రూప భర్త నరేష్ గల్ఫ్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నారు. కొంతకాలం క్రితం స్వగ్రామానికి వచ్చిన నరేష్.. కుటుంబ సభ్యులతో కలిసి కొత్తగా నిర్మించిన ఇంట్లో నూతన గృహ ప్రవేశం నిర్వహించారు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఆనందం కుటుంబంలో ఎంతోకాలం నిలవకముందే ఉపాధి కోసం నరేష్ తిరిగి గల్ఫ్‌కు వెళ్లారు.
అయితే అనూహ్యంగా రూప విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. భార్యను కోల్పోయిన నరేష్‌కు, తల్లిని కోల్పోయిన ఇద్దరు కుమారులకు ఈ ఘటన తీరని లోటుగా మిగిలింది. నిన్నటి వరకు కుటుంబ సభ్యుల నవ్వులతో కళకళలాడిన కొత్త ఇల్లు.. ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
also read : దేవాలయంలోకి చొరబడి పూజారిపై దాడి.. విగ్రహంపై కర్రలతో దాడి
