క్రైమ్ మిర్రర్ : దిల్‌సుఖ్‌నగర్ బస్ డిపో సమీపంలోని సంతోషిమాత దేవాలయంలో కలకలం రేగింది. గుర్తుతెలియని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి పూజారిపై దాడికి పాల్పడటంతో పాటు అమ్మవారి విగ్రహాన్ని కర్రలతో కొట్టిన ఘటన స్థానికంగా ఆందోళనకు దారితీసింది.
సమాచారం మేరకు.. ఆలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా గుడిలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న పూజారిపై దాడి చేసిన అనంతరం అమ్మవారి విగ్రహాన్ని కర్రలతో కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆలయంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
ఘటనను గమనించిన భక్తులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న చైతన్యపురి ఇన్‌స్పెక్టర్ సైదులు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ఆలయంలోకి ఎందుకు ప్రవేశించాడు? పూజారిపై, విగ్రహంపై దాడికి పాల్పడటానికి కారణం ఏమిటనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
also read : కరువులో ఉన్న నేల ఇప్పడు అభివృద్ది వైపు…! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
