Homeక్రైమ్ఏనుగు దంతాల ముఠా అరెస్టు...! 17కిలోల ఏనుగు దంతాలు స్వాధీనం...

ఏనుగు దంతాల ముఠా అరెస్టు…! 17కిలోల ఏనుగు దంతాలు స్వాధీనం…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఎంత‌క‌ఠినమైన చ‌ట్టాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ హైదరాబాద్‌లో అసాంఘీక శక్తులు, కొత్త నేరస్తులు పుట్టుకొస్తున్నారు. డ‌బ్బులు సులువుగా సంపాదించేందుకు అడ్డ‌దారులు తొక్కుతూ ఎంత‌టి దారుణానికైనా వెనుకాడ‌డం లేదు. హైద‌రాబాద్ ప‌ట్ట‌ణంలో ఇప్ప‌టి వ‌ర‌కు డ్ర‌గ్స్‌, గంజాయి, గోల్డ్‌, వేప‌న్స్‌, వ్య‌భిచారం గుట్టు చ‌ప్పుడుకాకుండా విక్ర‌యించే ముఠాతో పాటు ప‌క్కా స‌మాచారంలో మ‌రో మూఠా ను హైద‌రాబాద్ పోలీసులు చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. అక్ర‌మంగా ఏనుగుదంతాల‌ను త‌ర‌లిస్తూ హైద‌రాబాద్ పోలీసుల చేతికి చిక్క‌గా వారి వ‌ద్ద 1 7కిలోల బురువైన ఏనుగు దంతాల‌ను సీజ్ చేశారు.

నిందితులపై అక్రమ రవాణా, స్మగ్లింగ్‌ కేసు నమోదు చేశామని డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వన్యప్రాణుల అక్రమ రవాణా, వ్యాపారంపై డీఆర్‌ఐ నిఘా కొనసాగిస్తోంది. ఈ ఏడాది జూలై వరకు 440కి పైగా రక్షిత, అంతరించిపోతున్న జంతువులు, సుమారు 15 కిలోల బరువున్న ఐవరీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని 33 మంది నిందితులను అరెస్టు చేసింది.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

  1. ఏలూరులో మహిళ అదృశ్యం కేసులో ట్విస్ట్.. బంగారం కోసం గోదావరిలోకి తోసేసిన ఆటోడ్రైవర్!
  2. మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో కీలక తీర్పు.. భార్య, ప్రియుడుని దోషులుగా తేల్చిన కోర్టు
  3. విషాదాంతం.. పురుగుల మందు తిని చెరువులో దూకిన ప్రేమ జంట
  4. డబ్బుల కోసం అమ్మమ్మను హత్య చేసి పరారైన యువకుడు…

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు