Homeజాతీయంఅయోధ్య విరాళాల కేసుపై సుప్రీం ఫోకస్.. దర్యాప్తు నివేదిక కోరిన ధర్మాసనం

అయోధ్య విరాళాల కేసుపై సుప్రీం ఫోకస్.. దర్యాప్తు నివేదిక కోరిన ధర్మాసనం

క్రైమ్ మిర్రర్ : అయోధ్య రామాలయ విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తును వేగవంతం చేసి తుది దశకు తీసుకెళ్లాలని సూచించింది. అలాగే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు పురోగతిపై స్థితిగతుల నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది.చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విచారించింది. దర్యాప్తు మరింత నాణ్యంగా, పారదర్శకంగా సాగేందుకు వివిధ పక్షాలు చేసే సూచనలను SIT నిష్పక్షపాతంగా పరిశీలించాలని కోర్టు పేర్కొంది.

అయితే సూచనలను పరిగణనలోకి తీసుకోవడం దర్యాప్తు నాణ్యతను మెరుగుపరిచే అంశాలకే పరిమితం కావాలని స్పష్టం చేసింది. SIT సమర్పించే నివేదికను పరిశీలించిన అనంతరం రామాలయ నిధుల నిర్వహణకు సంబంధించి అవసరమైన మార్గదర్శకాలు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన SIT దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు పురోగతిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ కొనసాగుతున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
also read : ప్రియురాలిని చంపి గోనె సంచిలో కుక్కి.. బాలాపూర్‌లో దారుణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు