క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: సిద్దిపేట జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బంగారం, డబ్బు కోసం మహిళలను టార్గెట్ చేసి హత్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఓ మహిళ, ఆమె మైనర్ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో మరో హత్య, గతంలో జరిగిన దోపిడీ ప్రయత్నం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా మరో నలుగురిని టార్గెట్ చేసేందుకు నిందితులు ప్రణాళిక వేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం…
Also Read:బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి ప్రత్యక్షం.. 11 మందికి అస్వస్థత
అక్బర్‌పేట-భూంపల్లి పరిధిలోని రామక్కపేట గ్రామ శివారులో ఈ నెల 8న ఓ మహిళ మృతదేహం పాక్షికంగా కాలిపోయిన స్థితిలో కనిపించింది. మృతురాలిని భూంపల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల అతికం విజయగా పోలీసులు గుర్తించారు. ఆమె ఒంటరిగా నివసిస్తున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు.
కిరాణా దుకాణానికి పిలిచి…
Also Read:గోషామహల్ బరిలో బీజేపీ మహిళా నేత…?
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. విజయకు సమీపంలోనే కిరాణా దుకాణం నిర్వహిస్తున్న చాకలి రజిత ఆమెను ఆగస్టు 8 సాయంత్రం దుకాణానికి పిలిచినట్లు తెలుస్తోంది. అనంతరం రజిత, ఆమె మైనర్ కుమారుడు కలిసి విజయను హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. హత్య అనంతరం మృతదేహాన్ని బైక్‌పై రామక్కపేట శివారుకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. సాక్ష్యాలను నాశనం చేసి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఈ ప్రయత్నం చేసినట్లు అనుమానిస్తున్నారు. కాగావిజయ హత్యపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో నిందితుల ప్రమేయంతో మరో మహిళ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. బంగారం కోసం మహిళలను టార్గెట్ చేసేవారని దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కేసు మరింత కీలకంగా మారింది.
దోపిడీకి కూడా ప్రయత్నం…
Also Read:బాదం, వాల్‌నట్స్ కంటే ఇవే బెస్ట్… తక్కువ క్యాలరీలతో పోషకాలు ఎక్కువగా ఉండే సూపర్ నట్ ఇదే…!
తల్లి, కుమారుడు కలిసి గతంలో ఓ దోపిడీకి ప్రయత్నించినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో బయటపడినట్లు సమాచారం. ఈ కేసుతో పాటు హత్యలకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులు ఈజీ మనీ కోసం నేరాలకు పాల్పడుతున్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
మరో నలుగురిని టార్గెట్ …
Also Read:నేవీ నగర్‌లో విషాదం.. నావికుడి కుటుంబం అనుమానాస్పద మృతి
పోలీసుల విచారణలో మరింత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నిందితులు భూంపల్లి ప్రాంతానికి చెందిన మరో ముగ్గురు మహిళలతో పాటు రజిత భర్తను కూడా టార్గెట్ చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు డబ్బాక్ పోలీసులతో పాటు ప్రత్యేక బృందాలు, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, క్రైమ్ టీమ్‌లు లు ఈ వ్యవహరాంలో ఇంకా ఎవరెవరికి సబంధం ఉందన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
