టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కోణిదెల కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం తన భార్య లావణ్య త్రిపాఠి, కుమారుడు వాయువ్‌తో కలిసి తిరుమలకు వచ్చిన వరుణ్ తేజ్.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో వరుణ్ తేజ్ తన చిన్నారిని ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వరుణ్ తేజ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ, సోదరి నిహారిక కోణిదెల కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి స్వామివారిని దర్శించుకోవడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఇటీవలే వాయువ్ తొలి పుట్టినరోజు వేడుకలు
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు ఇటీవల తమ కుమారుడు వాయువ్ తొలి పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ చిన్నారి ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కుమారుడు తన జీవితంలో తీసుకొచ్చిన మార్పును ప్రస్తావిస్తూ వరుణ్ తేజ్ భావోద్వేగంగా స్పందించారు.
ఇప్పుడు కుమారుడు, భార్యతో కలిసి తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడంతో మెగా కుటుంబ అభిమానుల్లో ఈ ఫొటోలు, వీడియోలపై ఆసక్తి నెలకొంది.
‘బరి’లో వరుణ్ తేజ్
ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘కమిటీ కుర్రోళ్ళు’తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు యధు వంశీ తెరకెక్కిస్తున్న ‘బరి’ చిత్రంలో నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో వాలీబాల్ క్రీడ కీలకంగా ఉండనున్నట్లు ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
ఈ సినిమాను వరుణ్ తేజ్ సోదరి నిహారిక కోణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘బరి’ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా.. డానిష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. గ్రామీణ క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై వరుణ్ తేజ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
also read: చంద్రబాబు పాదాలకు నమస్కరించిన అనంత్ అంబానీ.. వైరల్‌గా మారిన వీడియో
