Homeఆంధ్ర ప్రదేశ్చంద్రబాబు పాదాలకు నమస్కరించిన అనంత్ అంబానీ.. వైరల్‌గా మారిన వీడియో

చంద్రబాబు పాదాలకు నమస్కరించిన అనంత్ అంబానీ.. వైరల్‌గా మారిన వీడియో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీకి సంబంధించిన ఓ ఆసక్తికర దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు పాదాలకు అనంత్ అంబానీ నమస్కరించడం పలువురి దృష్టిని ఆకర్షించింది.

మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

కార్యక్రమం పూర్తయిన అనంతరం చంద్రబాబు నాయుడు వేదిక నుంచి వెళ్తుండగా అనంత్ అంబానీ ఆయన వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాదాలకు నమస్కరించారు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో చంద్రబాబు సైతం క్షణం ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఇదే కార్యక్రమంలో అనంత్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌తో తన అనుబంధాన్ని ప్రస్తావించారు. తనను కూడా ఆంధ్రప్రదేశ్ బిడ్డగా భావించాలని చంద్రబాబును కోరారు. రాష్ట్రంలో వ్యవసాయం, విద్యా రంగాల అభివృద్ధికి రిలయన్స్ సంస్థ తరఫున సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

అనంత్ అంబానీ చూపిన గౌరవం, వినయాన్ని చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా ఆయనను ‘ఆంధ్రా ముద్దుబిడ్డ’గా సంబోధించారు. కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ప్రత్యేక దృశ్యానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలువురు తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

also read: ఆసియా క్రీడల్లో కలకలం.. లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత హాకీ అధికారి వెనక్కి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు