-
ఎల్‌బీ నగర్ సర్కిల్‌లో ఏసీపీ, టీపీఎస్ తీరుపై ప్రశ్నలు…! స్పందన ఎక్కడ..?
-
ఏసీపీ(ACP) ను కలవడం ఎందుకు కష్టంగా మారింది?
-
టీపీఎస్(TPS) వ్యవహారశైలిపైనా ఫిర్యాదుదారుల అసంతృప్తి
-
సీజ్ బోర్డు పెట్టి వదిలేయడమేనా?
-
అధికారుల ఆఫీస్ టైమింగ్స్‌పైనా ప్రశ్నలు
-
అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎక్కడో చెప్పేవారే లేరా?
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ఎల్‌బీ నగర్ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదుల విషయంలో ఏసీపీ(ACP), టీపీఎస్(TPS) వ్యవహారశైలిపై ఫిర్యాదుదారులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం, సీజ్ బోర్డులు ఏర్పాటు చేసిన తర్వాత తదుపరి చర్యలపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలపై అధికారులు వివరణ ఇవ్వాలని వారు కోరుతున్నారు.
కర్మన్ ఘాట్ లోని పద్మానగర్ రోడ్డు నెంబర్ 04 లో పర్మిషన్ వున్నది పార్కింగ్, మరియు 2 ఫ్లోర్ ఉంటే ఏకంగా నాలుగు ఫ్లోర్ కట్టినారు అని అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు భవనాలకు ‘సీజ్‌డ్’ బోర్డులు ఏర్పాటు చేసిన తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు దింతో నిర్మాణాలు యధావిధిగా జరుగుతూనే వున్నాయి అయినా అధికారులకు పట్టింపు లేదు అని విమర్శిస్తున్నారు వినిపిస్తున్నాయి.

అయితే బోర్డులు ఏర్పాటు చేసిన తర్వాత నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయా? సంబంధిత భవనాలను మళ్లీ తనిఖీ చేశారా? నిబంధనల ఉల్లంఘనలు కొనసాగితే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే విషయాలపై స్పష్టత లేదని వారు అంటున్నారు. సీజ్ చేసిన నిర్మాణాల్లో పనులు కొనసాగితే అధికారులు ఏ చర్యలు తీసుకున్నారు? ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిగాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.
-
ఏసీపీ(ACP) ను కలవడం ఎందుకు కష్టంగా మారింది?
ఫిర్యాదులపై వివరణ కోరేందుకు ACPను కలవడానికి ప్రయత్నించినా ఆమె అందుబాటులో ఉండటం లేదని కొందరు ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో విచారించినప్పుడు ఒకసారి సైట్‌కు వెళ్లారని, మరోసారి కోర్టుకు వెళ్లారని సమాధానాలు వస్తున్నాయని వారు చెబుతున్నారు.
ప్రజలు తమ సమస్యను అధికారికి నేరుగా వివరించేందుకు కార్యాలయానికి వస్తున్నప్పుడు అధికారి అందుబాటులో లేకపోతే ఫిర్యాదుదారులు ఎవరిని ఆశ్రయించాలి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టీపీఎస్(TPS) వ్యవహారశైలిపైనా ఫిర్యాదుదారుల అసంతృప్తి
ఇదే సమయంలో TPS (టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ /సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారి) వ్యవహారశైలిపైనా పలువురు ఫిర్యాదుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిగాయా? నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై ఏ చర్యలు తీసుకున్నారు? సీజ్ చేసిన నిర్మాణాల ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనే వివరాలను TPS స్పష్టం చేయాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.
-
సీజ్ బోర్డు పెట్టి వదిలేయడమేనా?
అక్రమ నిర్మాణంపై సీజ్ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత కూడా సంబంధిత అధికారులు తదుపరి చర్యలు తీసుకోకపోతే సీజ్ ప్రక్రియ ఉద్దేశ్యం ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిర్యాదు నుంచి తనిఖీ వరకు, తనిఖీ నుంచి సీజ్ వరకు, సీజ్ తర్వాత తదుపరి చర్యల వరకు మొత్తం ప్రక్రియను పారదర్శకంగా వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.

-
ACP, TPS ఎందుకు స్పందించడం లేదు?
ఈ వ్యవహారంపై ACP, TPS అధికారిక వివరణ కోరినా ఇప్పటివరకు స్పష్టమైన స్పందన రాలేదని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. తమపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై అధికారులు స్పందిస్తే వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలుస్తుందని వారు అంటున్నారు. అధికారుల వివరణ లేకపోవడంతో అనేక ప్రశ్నలు అలాగే మిగిలిపోతున్నాయని ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు.
-
ఉన్నతాధికారులు దృష్టి సారించాలి
ఎల్‌బీ నగర్ సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులు, సీజ్ చేసిన భవనాలు, వాటిపై తీసుకున్న తదుపరి చర్యలు, ACP మరియు TPS పరిధిలో ఉన్న ఫిర్యాదుల స్థితిగతులపై ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.
సీజ్ బోర్డుల వెనుక అసలు చర్యలు ఏమిటి?
ఫిర్యాదులపై ఫైళ్లు ఎక్కడ ఉన్నాయి?
ACP, TPS ఎందుకు స్పష్టమైన వివరణ ఇవ్వడం లేదు?
అక్రమ నిర్మాణాలపై తదుపరి చర్యలు ఎప్పుడు?
అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
సంబంధిత ACP, TPS లేదా ఉన్నతాధికారుల అధికారిక వివరణ లభిస్తే దానిని కూడా ప్రచురించడానికి క్రైమ్ మిర్రర్ సిద్ధంగా ఉంది.
