Crime Mirror, Political Updates: కేంద్ర మంత్రి మండలిలో మార్పులు చేర్పులపై ప్రధాని నరేంద్ర మోడీ ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బిజెపి ముఖ్య నాయకులతో పాటు ఆర్ఎస్ఎస్ ప్రముఖులతోనూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు ముఖ్య నాయకులకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం కనిపిస్తోంది.
సాధారణంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ తరహా అంశాలపై గోప్యతను పాటిస్తూ వస్తుంటారు. అయితే ఇప్పటికే ఇస్తున్న సంకేతాలను బట్టి కొంతమంది ముఖ్య నేతలకు అవకాశం దక్కుతుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజుల నుంచి వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు.
Also Read: ఓంకారేశ్వరం రహస్యం… నర్మదా నదీ మధ్యలో వెలసిన దివ్య జ్యోతిర్లింగ మహిమ – Crime Mirror
అటువంటి పార్టీలకు చెందిన ముఖ్య నాయకులకు కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోగా ఏ క్షణమైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చని చెబుతున్నారు.
మంత్రి మండలిలో ఇప్పటికే ఖాళీగా ఉన్న, కొద్ది రోజుల్లో ఖాళీ కాబోతున్న స్థానాలను భర్తీ చేయడంతో పాటు తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యుబిటి) వంటి పార్టీల నుంచి చీలిక వర్గం ఎంపీలు ప్రత్యేక వర్గాలుగా ఏర్పడి బిజెపికి మద్దతు ప్రకటించడంతో వాటి నుంచి కొందరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: ఇండియాలో హైడ్రోజన్ ట్రైన్స్…! – Crime Mirror
అలాగే భారతీయ జనతా పార్టీ నూతన సారధిగా ఎంపికైన నితిన్ నబీన్ జట్టులోనే కొంతమందినీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని ప్రస్తుతం విదేశాల్లో పర్యటిస్తున్నారు.
ఆయన పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ ఉంటుందని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి కొందరు ఎంపీలను మంత్రి మండలిలోకి తీసుకోనున్నారు. షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ నుంచి ఒక సీనియర్ నేతకు క్యాబినెట్ మంత్రి పదవి లభిస్తుందని ప్రచారం జరుగుతోంది..
-
పార్టీ ముఖ్య నేతలకు గవర్నర్లుగా అవకాశం..
ఇకపోతే పార్టీకి చెందిన సీనియర్ నేతలకు గవర్నర్లుగా అవకాశం కల్పించాలని పార్టీ అగ్ర నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వేరులో తావర్చంద్ గహలోత్ (కర్ణాటక), మంగు భాయ్ పటేల్ (మధ్యప్రదేశ్), గుర్మీత్ సింగ్ (ఉత్తరాఖండ్) పదవీకాలం త్వరలో ముగియనుంది. ప్రస్తుతం మంత్రుల్లో కొందరిని వీరు స్థానాల్లోకి పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి మండల నుంచి తప్పించబోయే వారి స్థానాల్లో యువ నేతలకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది..
Also Read: వరంగల్ లో కుళ్లిన పచ్చళ్ళ గుట్టు రట్టు… బయట కొనేవారికి హెచ్చరిక! – Crime Mirror
ఈ క్రమంలోనే ఆప్ నుంచి విడిపోయి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరికీ కేంద్రమంత్రులుగా అవకాశం కల్పించే యోచనలో బిజెపి అగ్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొద్ది రోజులుగా వివిధ వివాదాల్లో చిక్కుకున్న కొంతమంది కేంద్ర మంత్రుల పదవులకు కన్నం పడే అవకాశం కనిపిస్తోంది.
వీరిలో నీటి ప్రశ్నాపత్రం లీకేజీ, సీబీఎస్ఈ డిజిటల్ మూల్యాంకనంలో తప్పిదాల తర్వాత కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భవితవ్యం డోలాయమానంలో పడింది. అలాగే రాజ్యసభ సభ్యులుగా నవంబర్లో పదవీకాలం ముగిసిపోతున్న వారిలో కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, బి ఎల్ వర్మ వంటి నేతలు ఉన్నారు. వీరికి మరోసారి అవకాశం కల్పిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
Also Read: అద్దెకు బాయ్‌ఫ్రెండ్…లైంగిక సేవల పేరుతో వీడియోలు…! – Crime Mirror
అలాగే పంకజ్ చౌదరి, హర్ష మల్హోత్రాలకు యూపీ, ఢిల్లీ రాష్ట్ర శాఖల పార్టీ బాధ్యతలను పార్టీ అప్పగించింది. ఈ నేపథ్యంలో వీరిని కూడా కేంద్రమంత్రి పదవుల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జార్జ్ కురియన్, రవ్ నీత్ సింగ్ బిట్టు రాజ్యసభ పదవీకాలం ఈనెల 21 తో ముగిసింది. వీరికి కూడా మరోసారి అవకాశం కల్పించే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
ఇకపోతే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మూడు రాష్ట్రాలకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యతను ఇచ్చే అవకాశం ఉంది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ నుంచి పలువురికి మోడీ బృందంలో మంత్రులుగా అవకాశం ఇస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దీనిపై జూలై మొదటి వారంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read: రైతులకు చంద్రబాబు ఏరువాక శుభాకాంక్షలు…! – Crime Mirror