Homeఅంతర్జాతీయంమస్క్ తర్వాత అత్యధిక వేతనం.. సంచలనంగా మారిన శంఖ్ మిత్రా!

మస్క్ తర్వాత అత్యధిక వేతనం.. సంచలనంగా మారిన శంఖ్ మిత్రా!

క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయం:- ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలో అత్యధిక వేతనం పొందిన వ్యక్తిగా భారతీయ మూలాలున్న రియల్ ఎస్టేట్ సంస్థ ‘వెల్‌టవర్’ సీఈఓ శంఖ్ మిత్రా సంచలనం సృష్టించారు. గతేడాది ఆయన ఏకంగా 821 మిలియన్ డాలర్లు (సుమారు ₹7,784 కోట్లు) పారితోషికంగా అందుకుని వార్తల్లో నిలిచారు.కోల్‌కతాలోని ప్రసిద్ధ జాదవ్‌పూర్ వర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన శంఖ్ మిత్రా, ఆ తర్వాత అమెరికా (US) వెళ్లి అక్కడ ఎంబీఏ (MBA) చదివారు. అనంతరం ప్రముఖ కంపెనీల్లో పలు కీలక హోదాల్లో కొన్నేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించారు.

సీఈఓగా ఎదిగిన తీరు:- తన విశేష అనుభవంతో 2016లో వెల్‌టవర్ సంస్థలో చేరిన ఆయన, తన పనితీరుతో అంచెలంచెలుగా ఎదిగి 2020లో ఏకంగా ఆ సంస్థకే సీఈఓ (CEO) అయ్యారు.ఇక ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. 2025 సంవత్సరానికి గానూ ఏకంగా 158 బిలియన్ డాలర్లు ($158B) అందుకోవడం విశేషం. మస్క్ తర్వాత ఆ స్థాయిలో అత్యధిక పారితోషికం అందుకున్న వ్యక్తిగా శంఖ్ మిత్రా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

టీచర్లకు ‘టెట్’ నిబంధనపై న్యాయపోరాటం చేస్తాం: మాజీ సీఎం వైఎస్ జగన్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు