-
మరోసారి చతురత ప్రదర్శించిన చంద్రబాబు
-
కాపు కులం కార్డును తెరపైకి తెచ్చిన వైయస్సార్ కాంగ్రెస్
-
ప్రభుత్వపరంగా చర్యలతో బాధిత కుటుంబానికి భరోసా
-
నీరుగారి పోయిన జగన్ ప్రయత్నాలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీలో సాయి కృష్ణ అనే యువకుడి అదృశ్యం రాజకీయంగా కలకలం రేపింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణపై వివిధ నేరాలు ఉన్న నేపథ్యంలో విచారణ కోసం పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సాయి కృష్ణ కనిపించకుండా పోయారు. వెంటనే ఇది రాజకీయ రంగు పులుముకుంది. సాయి కృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడు కావడంతో వైసిపి ఆ కోణంలో రాజకీయం మొదలు పెట్టింది. సాక్షి మీడియాలో పతాక స్థాయిలో కథనాలు వచ్చాయి. కాపు యువకుడు లాకప్ డెత్ అంటూ కథనాలు వచ్చాయి. జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఆ కుటుంబాన్ని పరామర్శించి కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. రాష్ట్రస్థాయి ఆందోళనలకు ప్రణాళిక వేశారు. దానికి చెక్ పెట్టారు సీఎం చంద్రబాబు.
సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే…
ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు సింగపూర్ లో ఉన్నారు. అక్కడ నుంచి రాష్ట్రానికి రాగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పోలీసు ఉన్నతాధికారులతో కీలక చర్చలు జరిపారు. సర్కారును ఇరుకునపెట్టి, కుల రాజకీయంగా మలుచుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు ఊహించని షాక్ ఇచ్చారు. కాపు యువకుడు కావడంతో దీనిని ఒక రాజకీయ అస్త్రంగా మార్చుకోవాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ కేసు వ్యవహారంపై తక్షణమే స్పందించిన జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సిబిఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాపు కార్డును తెరమీదకి తెచ్చి గట్టిగానే ప్లాన్ చేశారు. కులం రంగు పూసేసి కాపు నేతలను రంగంలోకి దించారు. కానీ ఆ ప్రయత్నాలను చంద్రబాబు తన చతురతతో చెక్ పెట్టేశారు. తనదైన శైలిలో బ్రేక్ వేశారు.
బాధిత కుటుంబానికి భరోసా…
ప్రధాన ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గం కోణంలో ఆలోచన చేసి విమర్శలు చేస్తే.. చంద్రబాబుతో పాటు పవన్ ప్రభుత్వ పరంగానే చర్యల ద్వారా బాధిత కుటుంబంలో భరోసా నింపే ప్రయత్నం చేశారు. బాధలో ఉన్న సాయి కృష్ణ కుటుంబాన్ని వాదాచేందుకు హుటాహుటిన స్థానిక ఎమ్మెల్యేను వారి ఇంటికి పంపించారు. అది ఆ కుటుంబానికి భరోసా ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సస్పెండ్ చేసి.. అతనిపై హత్యాయత్నం సహా కట్టిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణకు ఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ దైవప్రసాద్ వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యం చెప్పారు. దీంతో సాయి కృష్ణ కుటుంబం శాంతించింది. ప్రభుత్వంపై విశ్వాసాన్ని నమ్మకాన్ని వ్యక్తం చేసింది. అయితే ఏదో జరిగిపోతుంది అని నమ్మకం పెట్టుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది షాకింగ్ పరిణామమే.