HomeతెలంగాణNBK111 మూవీ నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్...!

NBK111 మూవీ నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ యాక్షన్ చిత్రం #NBK111 కోసం మరోసారి జతకట్టారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం, యాక్షన్, ఎమోషన్స్, అద్భుతమైన సన్నివేశాల కలయికతో ప్రేక్షకులను అలరించనుంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ‘ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా’ పేరుతో ఒక పవర్ ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది, ఇది సినిమాలోని ఇంటెన్స్ వరల్డ్, బాలయ్య పవర్ ఫుల్ ప్రజెన్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. గ్లింప్స్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత, #NBK111 చిత్ర బృందం ఇప్పుడు కీలక పాత్రలో కనిపించనున్న కాజల్ అగర్వాల్‌ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Also Read:జస్ట్ రూ.24లకే ఫుట్‌బాల్ లైవ్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు

ఆమె పుట్టినరోజు సందర్భంగా, ఇంపాక్ట్ ఫుల్ పాత్రను సూచించే ‘ఫస్ట్ లుక్’ పోస్టర్‌ను రివిల్ చేశారు. ఈ పోస్టర్‌లో కాజల్ అగర్వాల్ ఎంతో హుందాగా కనిపిస్తున్నారు. చెక్స్ చీరలో, కళ్లజోడుతో కనిపించిన ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ కార్యాలయ వాతావరణంలో ఫైళ్లు, అధికారిక పత్రాల మధ్య కూర్చున్న కాజల్ పాత్ర కథలో కీలక ప్రాధాన్యతని చూపిస్తోంది. ఆమె చూపుల్లో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం పాత్ర ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయి. బాలకృష్ణ గ్లింప్స్‌లో 1993 బాంబే నేపథ్యంలో కనిపించిన ఉత్కంఠ, హింసాత్మక ప్రపంచానికి భిన్నంగా, కాజల్ పాత్రలో కనిపించిన స్థిరత్వం, నిబద్ధత కథలో ప్రత్యేక ముద్ర వేయబోతున్నాయి.

Also Read:అదనపు ఛార్జీలు చెల్లిస్తేనే యాడ్-ఫ్రీ మ్యూజిక్

ప్రస్తుతం #NBK111 చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. ఈ చిత్రంలో మనోజ్ మంచు ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సంగీత సంచలనం ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తుండగా, రామ్-లక్ష్మణ్, రవి వర్మ, వి. వెంకట్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, మనోజ్ మంచు, కాజల్ అగర్వాల్ లు న‌టిస్తున్నారు.

Also Read:వర్షాకాలంలో ఏసీని ‘కూల్ మోడ్’లో వాడుతున్నారా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు