క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు (ఆదివారం) సెలవు దినం అయినప్పటికీ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ ఘనంగా నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అధికారిక ఉత్తర్వులు వెలువరించారు.ఈ యోగా దినోత్సవ వేడుకల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కూడా తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలని జిల్లా విద్యాశాఖాధికారులకు (డీఈఓలకు) ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పాఠశాలలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేలా పర్యవేక్షించాల్సిందిగా సూచించారు.విద్యార్థుల్లో శారీరక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నవీన్ నికోలస్ వెల్లడించారు. ఈ ఆదేశాల నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.
రూ.27 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పంత్: భారీ పే కట్‌తో తిరిగి ఢిల్లీకి!
విరగబూసిన నేరేడు పండ్లు.. ఈసారి భయంకర కరవు?