క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ డెస్క్:- లక్నో సూపర్ జెయింట్స్ జట్టును వీడి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వెళ్లనున్నాడని క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఐపీఎల్ ట్రేడింగ్ విండోలో భాగంగా పంత్ మళ్లీ తన పాత ఫ్రాంచైజీ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ మార్పు కోసం ఆయన తన పారితోషికంలో భారీ కోతకు అంగీకరించినట్లు సమాచారం.గత మెగా వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన (రూ.27 కోట్లు) ఆటగాడిగా లక్నో జట్టుకు ఎంపికైన పంత్, తాజా డీల్‌లో భాగంగా కేవలం రూ.15 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్‌కి వెళ్లనున్నారట. అంటే ఏకంగా రూ.12 కోట్ల మేర నష్టపోయేందుకు ఆయన సిద్ధపడినట్లు తెలుస్తోంది.ఈ డీల్ గనుక అధికారికంగా ఖరారైతే.. రవీంద్ర జడేజా తర్వాత ఐపీఎల్ ట్రేడింగ్‌లో జీతం కోతకు అంగీకరించిన రెండో స్టార్ ప్లేయర్‌గా పంత్ నిలుస్తాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వద్ద రూ.18 కోట్ల భారీ ధరకు రిటైన్ అయిన రవీంద్ర జడేజా, ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టుకు వెళ్లే క్రమంలో రూ.14 కోట్లకే ట్రేడ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పంత్ కూడా అదే బాటలో ఏకంగా సగం మేర మొత్తాన్ని వదులుకుని సొంత గూటికి చేరేందుకు మొగ్గుచూపుతున్నట్లు క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.
మహారాష్ర్టలో కమలం ఆపరేషన్….నెక్స్ట్ టార్గెట్ శరద్ పవర్…!
ఏడాది నుంచి ఫోన్‌పే వాడకపోతే మీ జేబుకు చిల్లు పడినట్టే