Homeజాతీయంమ‌హారాష్ర్టలో క‌మ‌లం ఆప‌రేష‌న్‌....నెక్స్ట్ టార్గెట్ శరద్ పవర్...!

మ‌హారాష్ర్టలో క‌మ‌లం ఆప‌రేష‌న్‌….నెక్స్ట్ టార్గెట్ శరద్ పవర్…!

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: మరో మరాఠా పార్టీ చీలిక దిశగా అడుగులు వేస్తోందా? శివసేన ఉద్ధవ్ పార్టీ మాదిరిగానే.. శరద్ పవర్ ఎన్సిపి ఎస్పీ సైతం చిలిపోనుందా? శరద్ పవర్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు అజిత్ పవర్ నేషనలిస్ట్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అజిత్ పవర్ నేషనలిస్ట్ పార్టీ తమతో కొంతమంది సంప్రదింపులు జరుపుతున్నట్లు బాంబు పేల్చింది. అయితే వరుసగా వివిధ రాష్ట్రాల్లో బలమైన నేతలను నిర్వీర్యం చేసే క్రమంలో బిజెపి రాజకీయ క్రీడకు తెరలేపింది అన్న చర్చ నడుస్తోంది.

Also Read:ఏడాది నుంచి ఫోన్‌పే వాడకపోతే మీ జేబుకు చిల్లు పడినట్టే

బెంగాల్ తర్వాత వరుసగా…

పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని నిర్వీర్యం చేసే క్రమంలో.. తృణముల్ కాంగ్రెస్ పార్టీని అడ్డగోలుగా చీల్చగలిగింది భారతీయ జనతా పార్టీ. బిజెపి సహకారం లేకుండా మమతా పార్టీలో కల్లోలం అసాధ్యం. ఆ పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు వేరు శిబిరం గా ఉన్నారు. 20 మంది ఎంపీలు వేరే పార్టీలో విలీనం అయ్యారు. రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక బిజెపి ఉందన్నది బహిరంగ రహస్యం.

Also Read:వర్షాకాలంలో ఏసీని ‘కూల్ మోడ్’లో వాడుతున్నారా..?

దెబ్బతిన్న మరాఠా పార్టీలు..

అయితే ఇప్పుడు బిజెపి చూపు మహారాష్ట్ర పై పడింది. ఇప్పటికే బీజేపీతో వైరం పెంచుకొని ఉద్దవ్ శివసేన దారుణంగా దెబ్బతింది. చివరకు ఆ దెబ్బతిన్న ఉద్దవ్ పార్టీని సైతం వదల్లేదు. పూర్తిగా కబలించింది. మిగిలిన కొద్ది మంది ఎంపీలను సైతం చీల్చింది. ఇప్పుడు శరద్ పవర్ పై బిజెపి కన్ను పడింది. అయితే బిజెపి నేరుగా ఎక్కడ కలుగజేసుకోలేదు. అజిత్ పవర్ ఎం సి పి ద్వారా తమ ప్రయత్నాలు జరిపింది. శరద్ పవర్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీమంత్రి బాబా ధర్మారావు ఆత్రం వెల్లడించారు. దీంతో తదుపరి టార్గెట్ శరద్ పవర్ ఎన్సీపీ అని తేలిపోయింది.

Also Read:అదనపు ఛార్జీలు చెల్లిస్తేనే యాడ్-ఫ్రీ మ్యూజిక్

చీలిక సాధ్యమేనా..?

లోక్సభలో శరద్ పవర్ ఎన్సీపీకి 8 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలో ఒక ఎంపీ కూడా ఉన్నారు. పార్లమెంటరీ పార్టీలో చీలిక రావాలన్నా.. అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలన్నా పార్టీకి చెందిన మూడేంట రెండు వంతుల మంది ఎంపీలు జతకట్టవాల్సి ఉంటుంది. చట్టబద్ధంగా విడిపోవాలంటే లోక్ సభలో ఆరుగురు ఎంపీలు ఏకపాటి పైకి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం శరద్ పవర్ వర్గం నుంచి ఎంపీలుగా సుప్రియ సూలే, అమూల్ కుల్హే, బజరంగ్ సోనావాని, నిలేష్ లంకె, సురేష్ మహత్రే, అమర్ కలే, భాస్కర్ భగిరే, ధైర్య శీల్ మోహితే పాటిల్ ఉన్నారు. మరి వీరిలో ఎవరు గోడ దూకుతారు అన్నది తెలియాల్సి ఉంది.

Also Read:జస్ట్ రూ.24లకే ఫుట్‌బాల్ లైవ్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు