హైదరాబాద్,క్రైమ్‌మిర్రర్: సౌత్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా కరుప్పు సినిమా విడుదలకు ముందు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, ఆ సమయంలో భార్య జ్యోతిక తనకు అండగా నిలిచిన విధానాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. సూర్య మాట్లాడుతూ కరుప్పు విడుదలకు ముందు చివరి నిమిషంలో ఊహించని ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. సినిమా రిలీజ్‌కు సంబంధించిన ఆర్థిక భారాలు ఒక్కసారిగా పెరగడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఆ క్లిష్ట సమయంలో జ్యోతిక తనకు పూర్తిగా మద్దతుగా నిలిచారని, ఆమె ధైర్యం లేకపోతే ఆ పరిస్థితులను ఎదుర్కోవడం చాలా కష్టమయ్యేదని వెల్లడించారు.
Also Read:సీఆర్పీఎఫ్ క్యాంపులో కాల్పుల కలకలం.. ఇద్దరు జవాన్లు మృతి
ఎన్నో సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ, కరుప్పు విడుదలకు ముందు ఎదురైన పరిస్థితులు జీవితంలో అత్యంత కఠినమైనవని సూర్య అన్నారు. ఒకవేళ సినిమా ఆశించిన ఫలితం సాధించకపోతే తమ జీవితాలు పూర్తిగా మారిపోయేవని, కానీ జ్యోతిక తనపై ఉంచిన నమ్మకం వల్లే ధైర్యంగా ముందుకు వెళ్లగలిగామని చెప్పారు. అయితే ఆ నిర్ణయం తనది ఒక్కటే కాదని, తామిద్దరం కలిసి బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని సూర్య పేర్కొన్నారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఒకరికొకరు ధైర్యంగా నిలబడాలని జ్యోతిక చెప్పిన మాటలు తనకు ఎంతో బలం ఇచ్చాయని తెలిపారు. అందుకే ఈ విజయానికి ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: ట్రైనీ ఐపీఎస్ కేసులో మరో ట్విస్ట్… దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి..
కొంతకాలంగా సరైన విజయానికి ఎదురుచూస్తున్న సూర్యకు కరుప్పు చిత్రం భారీ కమర్షియల్ సక్సెస్‌ను అందించింది. అయితే విడుదల రోజున ఆర్థిక సమస్యల కారణంగా కొన్ని షోలు రద్దు కావడంతో సినిమా రిలీజ్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనంతరం అన్ని సమస్యలు పరిష్కారమై సినిమా విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం సూర్య కెరీర్‌కు కొత్త ఊపునిచ్చింది. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
