Homeక్రైమ్మొదటి భార్యతో భర్తకు సంబంధాలు.. ప్రియుడితో కలిసి రెండో భార్య దారుణం

మొదటి భార్యతో భర్తకు సంబంధాలు.. ప్రియుడితో కలిసి రెండో భార్య దారుణం

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. భర్త తన మొదటి భార్యతో సంబంధాలు కొనసాగిస్తున్నాడనే అనుమానంతో రెండో భార్య అతడిని హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి భార్యతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. రామ్‌కిషోర్‌ వాల్మీకి అనే వ్యక్తి మొదటి భార్యతో సంబంధాలు కొనసాగించడంపై అతడి రెండో భార్య సుఫియా బానో తరచూ గొడవపడేది. ఈ వ్యవహారం చివరకు హత్యకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు.

సెప్టెంబర్‌ 14-15 మధ్య రామ్‌కిషోర్‌ను సుఫియా బానో తన ప్రియుడు మున్నా, అతడి సహచరుడు ఇక్బాల్‌తో కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని ఓ పెట్టెలో దాచిన నిందితులు.. ఈ-రిక్షాలో తీసుకెళ్లి కాలువ సమీపంలో పడేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

రామ్‌కిషోర్‌ కనిపించకపోవడంతో సెప్టెంబర్‌ 17న అతడి మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సుమారు 180 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుల కదలికలను గుర్తించారు.

సీసీటీవీ ఆధారాలతో దర్యాప్తు ముందుకు సాగడంతో సుఫియా బానో, ఆమె ప్రియుడు మున్నా, అతడి సహచరుడు ఇక్బాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

also read: బెంగాల్ లో మమతకు మరో షాక్…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు