Homeజాతీయంఅమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026.. సేల్ ఎప్పటి నుంచి అంటే?

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026.. సేల్ ఎప్పటి నుంచి అంటే?

పండగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్‌కు సిద్ధమవుతున్న వారికి అమెజాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ-కామర్స్ దిగ్గజం నిర్వహించే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ తేదీని ప్రకటించింది. అక్టోబర్ 8 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. దీంతో అమెజాన్‌లో వివిధ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులోకి రానున్నాయి.

ఇక మరో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ 2026 సేల్‌ను అక్టోబర్ 9 నుంచి ప్రారంభించనున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. అయితే ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్లకు అక్టోబర్ 8 నుంచే సేల్ యాక్సెస్ లభించనుంది. ఈ నేపథ్యంలో అమెజాన్ సేల్ సాధారణ వినియోగదారులకు ఒక రోజు ముందుగానే ప్రారంభం కావడం ఆసక్తికరంగా మారింది.

ఎస్‌బీఐ కార్డులతో 10 శాతం డిస్కౌంట్

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భాగంగా ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. అలాగే ప్రైమ్ సభ్యులకు అదనపు ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి నిబంధనలు, డిస్కౌంట్ పరిమితులు సేల్ సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ప్రత్యేక డీల్స్ కూడా..

ఈసారి సేల్‌లో 8 PM డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్, టాప్ 100 డీల్స్, మెగా డీల్స్ వంటి ప్రత్యేక విభాగాల్లో ఆఫర్లు అందించనున్నట్లు అమెజాన్ తెలిపింది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు తదితర విభాగాల్లో ఎలాంటి ఆఫర్లు ఉంటాయనే వివరాలు సేల్ తేదీ సమీపించే కొద్దీ వెల్లడయ్యే అవకాశం ఉంది.

అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్ ఎప్పుడు ముగుస్తుందనే విషయాన్ని అమెజాన్ ఇంకా ప్రకటించలేదు. సేల్ ప్రారంభానికి ముందు మరిన్ని ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు వెలువడే అవకాశం ఉంది.

also read: అమృత్‌సర్‌లో ASIపై దుండగుల దాడి.. కాల్పుల్లో మృతి చెందిన పోలీస్ అధికారి హర్జీత్ సింగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు