Homeసినిమాడిసెంబర్ 24న బాక్సాఫీస్ బిగ్ ఫైట్!

డిసెంబర్ 24న బాక్సాఫీస్ బిగ్ ఫైట్!

క్రైమ్ మిర్రర్, సినిమా:- ఈ ఏడాది చివర డిసెంబర్ నెలలో సీనియర్ హీరోల మధ్య భారీ బాక్సాఫీస్ సమరం తప్పేలా కనిపించడం లేదు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24వ తేదీన బాలకృష్ణ నటిస్తున్న ‘దాదా’ చిత్రం విడుదల కానుంది. ఇదే రోజున బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన ‘కింగ్’, అలాగే అక్కినేని నాగార్జున చిత్రం ‘కింగ్ 100’ కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

రికార్డుల వేటగాడు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బర్త్డే స్పెషల్!

భారీ పోటీ నేపథ్యంలో బాలయ్య నటించిన ‘దాదా’ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చిత్ర నిర్మాతలు స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. నిర్ణయించిన తేదీకే సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నామని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
రాబోయే సంక్రాంతితో పాటు మార్చి, ఏప్రిల్ నెలల్లో కూడా వరుసగా అనేక పెద్ద సినిమాలు విడుదల వరుసలో సిద్ధంగా ఉన్నాయి. దీంతో క్రిస్మస్ సెలవులతో పాటు వీకెండ్ కాంబినేషన్‌ను పూర్తిగా క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. దాంతో డిసెంబర్ 24న ముగ్గురు స్టార్ హీరోల చిత్రాల మధ్య బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారనుంది.

ఏపీలో పరిషత్ పోలింగ్ హంగామా: పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వాయిదా

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు