క్రైమ్ మిర్రర్,తెలంగాణ :- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బౌన్సర్ల కంటే హీనంగా తయారయ్యారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌ను “ట్విట్టర్ టిల్లు” అని సంబోధిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“నువ్వు తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిన మేనేజ్‌మెంట్ కోటా నాయకుడివి. మేము ప్రజా పోరాటాల నుంచి, లాఠీ దెబ్బలు తిని, జైలు జీవితం అనుభవించి వచ్చిన మెరిట్ కోటా నేతలం. అమిత్ షా మహా పాదయాత్రలో తోపులాట జరగకుండా జనాన్ని నియంత్రిస్తే, నన్ను బౌన్సర్‌తో పోల్చి కించపరచడం నీ అహంకారానికి నిదర్శనం” అని సంజయ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంలో భగవద్గీతలోని శ్లోకాన్ని ఉటంకిస్తూ, కురుక్షేత్రంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే అర్జునుడి రథానికి సారథిగా మారి సేవ చేశాడని, సకల లోకాల పరమాత్ముడే చిన్న సేవ చేయడానికి వెనుకాడనప్పుడు, పార్టీకి కార్యకర్తగా సేవ చేయడం తన బాధ్యత అని చెప్పారు. “దీన్ని నువ్వు బౌన్సర్ పని అనవచ్చు.. కానీ అది నా ధర్మం. అహంకారం లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించడమే క్రమశిక్షణ కలిగిన కార్యకర్త లక్షణం” అని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నంతకాలం సొంత కార్యకర్తలను కూడా పట్టించుకోని చరిత్ర బీఆర్ఎస్‌దేనని, తమకు ఎలాంటి ఈగోలు లేవని బండి సంజయ్ కేటీఆర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ సూపర్.. టెస్ట్ లోకి తీసుకోవాలి : గవాస్కార్
