క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. బాలికకు ఆర్థోపెడిక్ సర్జరీ అత్యంత విజయవంతంగా ముగిసిందని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు.అంతేకాకుండా, ప్లాస్టిక్ సర్జరీ నిపుణుల బృందం కూడా బాలిక పరిస్థితిని నిశితంగా పరిశీలించి రివ్యూ చేసిందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి బెంగళూరులోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలోని పీఐసీయూ (PICU – పెడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోందని తెలిపారు.
బాధితురాలికి సాధ్యమైనంత వరకు అత్యుత్తమ వైద్య సహాయం అందించడమే తమ ప్రాధాన్యత అని చెప్పిన నారా లోకేష్, తాను స్వయంగా నిరంతరం మెడికల్ టీమ్‌తో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని స్పష్టం చేశారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వపరంగా కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రికార్డుల వేటగాడు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బర్త్డే స్పెషల్!
