క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. మొత్తం 7,767 ఎంపీటీసీ స్థానాలకు గాను 18,843 మంది అభ్యర్థులు, అలాగే 582 జెడ్పీటీసి స్థానాలకు గాను 2,169 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్‌లో దాదాపు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5:00 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు: నేతలకు సీరియస్ హెచ్చరికలు జారీ చేసిన పీసీసీ చీఫ్
అయితే, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా సాధారణ జీవితం స్తంభించిపోవడంతో అక్కడ పోలింగ్‌ను రేపటికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.
సీపీఆర్ ఎందుకు చేయలేదు? పాఠశాల సిబ్బందిని నిలదీసిన తల్లిదండ్రులు
