క్రైమ్ మిర్రర్,తెలంగాణ :- తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రజాప్రతినిధుల మధ్య రగులుతున్న వరుస వివాదాలు, బహిరంగ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శల వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ నేపథ్యంలో వివాదాలకు చెక్ పెట్టేందుకు నేతలను నేరుగా గాంధీ భవన్‌కు పిలిపించి పంచాయితీ తీర్చాలని నిర్ణయించారు. నేడు మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావులతో పీసీసీ చీఫ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
సీపీఆర్ ఎందుకు చేయలేదు? పాఠశాల సిబ్బందిని నిలదీసిన తల్లిదండ్రులు
అలాగే, నిరసనలు, అంతర్గత విభేదాలకు కారణమవుతున్న ఇతర నేతలపై కూడా దృష్టి సారించారు. ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిలతో పాటు ఇటీవల మంత్రి శ్రీధర్ బాబుకు శాటైరికల్ లేఖ రాసి కలకలం రేపిన ఎంపీ వంశీకృష్ణను పిలిపించి వివరణ తీసుకోనున్నట్లు సమాచారం. సొంత పార్టీ నేతలే ఈ విధంగా వివాదాల్లో చిక్కుకోవడంపై క్లాస్ తీసుకుని, ఇటువంటి చర్యలు మళ్ళీ రిపీట్ కాకుండా ఫుల్ స్టాప్ పెట్టాలని పీసీసీ నాయకత్వం భావిస్తోంది.
