హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది సెప్టెంబర్ 25న గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది. అనంత చతుర్దశి పర్వదినం కూడా అదే రోజున ఉండటంతో సెప్టెంబర్ 25న హుస్సేన్ సాగర్లో మహాగణపతిని నిమజ్జనం చేయాలని నిర్ణయించారు.
ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి ‘శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి’ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సాధారణంగా 11 రోజుల పాటు కొనసాగే ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు ఈసారి 12 రోజుల పాటు నిర్వహించనున్నారు. దీంతో భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు మరో రోజు అదనపు అవకాశం లభించనుంది.
నిమజ్జనం తేదీ ఖరారు కావడంతో ఖైరతాబాద్ పరిసరాల్లో ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఉత్సవ కమిటీ, అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టనున్నారు.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మహాగణపతి నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 25న హుస్సేన్ సాగర్లో నిమజ్జనం జరగనుండటంతో హైదరాబాద్ నగరంలో గణేశ్ ఉత్సవాల సందడి మరింత పెరగనుంది.
also read: జైలర్ 2లో బోధిగా ఎస్.జె. సూర్య.. అదిరిపోయే క్యారెక్టర్ ప్రోమో రిలీజ్
