Homeతెలంగాణ'వయసు' అసలు పాయింట్!

‘వయసు’ అసలు పాయింట్!

• మైనర్ అని తేలితే బండి భగీరథ్ కు కష్టమే
• మేజర్ అని తెలిస్తే కాస్త ఉపశమనం
• లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణలోని బండి సంజయ్ కుమారుడి కేసు పైనే. అసలు ఈ కేసులో ఎటువంటి సంచలనాలు నమోదు అవుతాయో? అనే ఆత్రుత అందరిలోనూ ఉంది. అయితే బాధితురాలి వయస్సు తీవ్ర ఉత్కంఠకు కారణం అవుతోంది. ఈ కేసులో నిందితుడి భవిష్యత్తు పూర్తిగా అమ్మాయి మైనరా? మేజరా? అనే పాయింట్ చుట్టూ ఆధారపడి ఉంది. ఒకవేళ ఆమె మైనర్ అని న్యాయస్థానంలో నిరూపితమైతే.. బండి భగీరథ్ పై పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు తప్పవు. అదే మేజర్ అని తెలిస్తే మాత్రం.. పరస్పర అంగీకారంతో జరిగిన వ్యవహారంగా పరిగణించి సాధారణ తీర్పులు వచ్చే అవకాశం ఉంది.

పాఠశాల రికార్డుల పరిశీలన..
ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. బాధితురాలి పాఠశాల రికార్డులు, మున్సిపల్ బర్త్ సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టుగా ఆమె మేజర్ అని నిరూపించగలిగితే నిందితుడికి ఊరట దక్కి చాన్స్ ఉంది. ఎందుకంటే గతంలోనూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా కలిసి ఉన్నప్పుడు.. ఆ తరువాత మనస్పర్ధలు కారణంగా రేప్ కేసులు పెట్టుకుంటామంటే కుదరదు. ఈ విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం చెప్పడంతో.. ఇప్పుడు బాధితురాలి వయస్సు అనేది అసలు పాయింట్ గా మారింది. మైనర్ వయస్సును నిర్ధారించడానికి న్యాయస్థానాలు కొన్ని రకాల నిబంధనలు పాటిస్తాయి. మొదటిగా పాఠశాల రికార్డులు లేదా పదో తరగతి సర్టిఫికెట్. ఇవి అందుబాటులో లేకపోతే మున్సిపాలిటీ/ పంచాయితీ జారీ చేస్తే బర్త్ సర్టిఫికెట్లను పరిగణలోకి తీసుకుంటారు. ఇవన్నీ లేని పక్షంలో వైద్య పరీక్షల ద్వారా వయస్సును అంచనా వేస్తారు. ఈ కేసులో ప్రాథమికంగా విద్యాశాఖ రికార్డుల ప్రకారం ఆమె మైనర్ అని తేలితే.. వేరే వాదనలకు తావుండదు.

జిహెచ్ఎంసి రికార్డులు సైతం..
ఈ కేసులో వెలుగులోకి వచ్చినప్పుడు ఆమె మైనర్ అనే అనుమానాలు బలంగా వినిపించాయి. కానీ తర్వాత సోషల్ మీడియాలో విభిన్న పుట్టిన తేదీల ఆరోపణలు వచ్చాయి. అందుకే ఈ కేసు విచారణకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. లోతైన విచారణ చేపడుతోంది. జిహెచ్ఎంసి రికార్డుల్లో పుట్టిన తేదీ ఎప్పుడు నమోదయింది? పుట్టిన వెంటనే నమోదు చేశారా? లేకుంటే ఏమైనా ప్రయోజనాల కోసం తర్వాత మార్పులు చేశారా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఒకవేళ రికార్డుల్లో ట్యాంపరింగ్ జరిగినట్లు తేలితే కేసు మరో మలుపు తిరుగుతుంది. అయితే పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఆమెను మైనర్ గా గుర్తించి ఫోక్సో సెక్షన్లను చేర్చారు. వీటిని కొట్టివేయాలంటే పక్క ఆధారాలు దొరకాలి. తెలంగాణ రాజకీయాల్లో ఇదో హై ప్రొఫైల్ కేసుగా మారింది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు