Homeఅంతర్జాతీయంజ‌పాన్‌లో భూ ప్ర‌కంప‌న‌లు...! సునామీ హెచ్చ‌రికాలు జారీ...

జ‌పాన్‌లో భూ ప్ర‌కంప‌న‌లు…! సునామీ హెచ్చ‌రికాలు జారీ…

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: జ‌పాన్‌లో సోమ‌వారం 4.30 గంట‌ల ప్రాంతంలో భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. జపాన్ మెటీరియోలాజికల్ ఏజెన్సీ తెలిపిన వివరాల మేరకు.. భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదు అయింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఉత్తర ఇవాట్ ప్రిఫెక్చర్‌లోని పసిఫిక్ మహాసముద్రంలో భూప్రకంపనలు వచ్చాయి. ఈ భూప్రకంపనల కారణంగా టోక్యోతోపాటు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లోని బిల్డింగ్‌లు కంపించాయి.

సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని ప్ర‌జ‌ల‌కు ఆదేశాలు జారీ…

జ‌పాన్సంలో సంభ‌వించిన భూ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఈశాన్య తీరంలోని ప‌సిఫిక్ మ‌హాస‌ముద్ర తీర ప్రాంతాల‌కు సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో 3 మీటర్ల(సుమారు 10 అడుగులు) ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ మెటీరియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. ప్రధానంగా ఇవాటే, ఆమోరీ, హొక్కైడో ప్రిఫెక్చర్‌లకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రతీర ప్రాంతంలోని వారు వీలైనంత త్వరగా అక్కడినుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. సునామీ హెచ్చరికలు ఎత్తి వేసే వరకు సురక్షిత ప్రాంతాలను వీడరాదని స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు