లండన్ నగరంలో గుండె ఆగిపోయేలా చేసే ఘటన చోటుచేసుకుంది. ఒక్క క్షణం ఆలస్యం అయినా పెద్ద ప్రమాదం జరిగేదీ… కానీ, ఓ భారతీయ యువకుడి ధైర్యం, సమయస్ఫూర్తి ఓ చిన్నారి ప్రాణాలను కాపాడింది.
ఇల్‌ఫోర్డ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ భవనంలో ఈ సంఘటన జరిగింది. కేవలం మూడేళ్ల చిన్నారి… ఎవరూ ఊహించని విధంగా కిటికీ అంచుకు చేరి, అక్కడి నుంచి జారి బయటకు వేలాడుతూ ప్రాణాపాయ స్థితిలో పడిపోయింది. కింద ఉన్నవారు చూస్తూ భయంతో గట్టిగా అరిచారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేస్తే ఆ చిన్నారి కింద పడిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపించింది.
అదే సమయంలో అక్కడ సమీపంలో ఉన్న భారతీయ రెస్టారెంట్ మేనేజర్ మహ్మద్ జెసిల్ పరిస్థితిని గమనించాడు. ఆలోచించడానికి కూడా టైం లేకుండా వెంటనే చర్య తీసుకున్నాడు. అక్కడే ఉన్న ఓ పోలీస్ అధికారి సహాయంతో ఇద్దరూ కలిసి ఆ చిన్నారిని కాపాడారు.
A tense situation in Ilford today ended safely after a young child was found in danger at a window and was quickly rescued through the combined efforts of a police officer and a member of the public.
pic.twitter.com/4fmasluJj3— Harry Sawyer (@HSawyer11526) June 11, 2026
చిన్నారి దాదాపు తొమ్మిది నిమిషాల పాటు కిటికీ అంచున వేలాడుతూ ఉండగా… కింద నుంచి ఇద్దరూ జాగ్రత్తగా గమనిస్తూ సరైన సమయాన్ని చూసి గాల్లోనే పట్టుకుని రక్షించారు. ఆ క్షణం అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఊపిరి ఆగిపోయినట్టే అయ్యింది.
చివరికి చిన్నారి సురక్షితంగా రక్షించబడింది. అక్కడున్న ప్రజలు నిట్టూర్పు విడిచారు. మహ్మద్ జెసిల్ ధైర్యానికి, సమయస్ఫూర్తికి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “రియల్ హీరో” అంటూ నెటిజన్లు మహ్మద్ జెసిల్‌ను కొనియాడుతున్నారు. మనుషుల్లో ఇంకా మానవత్వం బ్రతికే ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
ALSO READ: సి-సెక్షన్ తర్వాత కిడ్నీ సమస్యలు వస్తాయా ? గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు