Homeసినిమావిశ్వక్, రామ్ తర్వాత.. ఇప్పుడు కిరణ్ అబ్బవరం వంతు..!

విశ్వక్, రామ్ తర్వాత.. ఇప్పుడు కిరణ్ అబ్బవరం వంతు..!

క్రైమ్ మిర్రర్, సినిమా:- టాలీవుడ్‌లో హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్న ట్రెండ్ పెరుగుతోంది. ఇప్పటికే విశ్వక్ సేన్ దర్శకుడిగా తన ప్రతిభను చూపించగా, రామ్ పోతినేని కూడా స్వీయ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. తమిళ హీరో విశాల్ సైతం దర్శకుడిగా మారబోతున్నట్లు ఇటీవల వెల్లడించారు. ఇప్పుడు ఈ జాబితాలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పేరు కూడా వినిపిస్తోంది.రాజా వారు రాణి గారు సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం, తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల క సినిమా విజయంతో మంచి ఫామ్‌లోకి వచ్చిన ఆయన, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. చెన్నై లవ్ స్టోరీ తో పాటు క2 సినిమాల్లో నటిస్తున్న కిరణ్ అబ్బవరం, కెరీర్‌లో మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

ప్రాణాల కోసం పోరాడిన చిన్నారి… ఆఖరి క్షణంలో కాపాడిన భారతీయుడు

సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా, కథల రచనపైనా కిరణ్‌కు మంచి ఆసక్తి ఉంది. గతంలో ఎస్‌ఆర్ కళ్యాణమండపం చిత్రానికి కథ, రచనలో భాగస్వామ్యం అయ్యారు. అలాగే నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్రానికి కూడా రచనా సహకారం అందించారు. నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ అనే చిత్రాన్ని నిర్మించడం ద్వారా మరో బాధ్యతను కూడా విజయవంతంగా నిర్వహించారు.ఇప్పుడు దర్శకుడిగా మారేందుకు కిరణ్ అబ్బవరం సిద్ధమవుతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే తన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు సంబంధించిన కథ, స్క్రిప్ట్ పనులు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో హీరోగా కూడా కిరణ్ అబ్బవరం నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, రచయితగా, నిర్మాతగా అనుభవం ఉన్న కిరణ్ అబ్బవరం దర్శకుడిగా ఎలా మెప్పిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమైతే, నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను నిరూపించుకునే మరో అవకాశం ఆయనకు దక్కినట్టే అవుతుంది.

తెలుగు హీరో సుహాస్‌కు తమిళంలో భారీ ఛాన్స్.. రూ.80 కోట్ల సినిమాలో కీలక పాత్ర!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు