Homeఆంధ్ర ప్రదేశ్చంద్రగిరిలో విషాదం.. వ్యక్తి ఆత్మహత్య- పోలీసుల వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యుల నిరసన

చంద్రగిరిలో విషాదం.. వ్యక్తి ఆత్మహత్య- పోలీసుల వేధింపులే కారణమంటూ కుటుంబ సభ్యుల నిరసన

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాయలచెరువు ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ఇంటి వద్ద జరిగిన తగాదా నేపథ్యంలో హరి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ కేసులో సుబ్రమణ్యంను స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు అతనిపై దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పోలీసుల చేత దాడికి గురైన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన సుబ్రమణ్యం, తన పొలంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, మృతదేహంతో రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు.

తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారి తీసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

also read: బిహార్‌లో దారుణం: పెళ్లికి నిరాకరించిందని యువతిని బైక్‌తో ఈడ్చుకెళ్లిన యువకుడు

తాజావార్తలు